ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: అవంతి రాజీనామా.. వైసీపీకి కొత్త టెన్షన్..

ABN, Publish Date - Dec 13 , 2024 | 12:54 PM

మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆయన బాటలో మరెంతమంది ఉన్నారోననే చర్చ జరుగుతోంది. ముత్తంశెట్టి 2019 ఎన్నికలకు కొద్దిరోజులు ముందు..

YS Jagan

విశాఖపట్నం, డిసెంబరు 13: మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆయన బాటలో మరెంతమంది ఉన్నారోననే చర్చ జరుగుతోంది. ముత్తంశెట్టి 2019 ఎన్నికలకు కొద్దిరోజులు ముందు వైసీపీలో చేరారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ అభ్యర్ధిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. భీమిలి నుంచి గెలిచిన ముత్తంశెట్టికి మంత్రిగా అవకాశం కల్పించారు. మూడేళ్ల తర్వాత మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. కొద్దిరోజులకే జిల్లా అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించారు. అప్పటి నుంచీ పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి భీమిలి నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు ముత్తంశెట్టి. ముఖ్యమైన కార్యక్రమాలకు తప్పనిసరి పరిస్థితిలో హాజరైనప్పటికీ ముభావంగా ఉండి వెళ్లిపోతున్నారు.


ఈ నేపథ్యంలో హఠాత్తుగా గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భీమిలి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్‌మోహన్ రెడ్డి అన్నీ సమీక్షించుకొని, తప్పులు సరిచేసుకొని పార్టీని ముందుకు తీసుకువెళతారని భావించానని, కానీ అటువంటివేమీ కనిపించలేదని ఆయన వ్యాఖ్యానించారు.


ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడే వైసీపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. ముత్తంశెట్టి బాటలో మరి కొందరు నేతలు ఉన్నట్లు గట్టి ప్రచారమే జరుగుతోంది. వైసీపీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో పార్టీ పెద్దలు అలర్ట్ అయ్యారట. ఉన్నవాళ్లు కూడా పోతే.. పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందని భావించి ఉపశమన చర్యలకు ఉపక్రమించారట. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో.. వారిని గుర్తించి బుజ్జగించాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.


Also Read:

స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం..

పోలీసుల అదుపులో ఎంపీ అవినాష్..

భయంతో పేర్ని ఫ్యామిలీ పరార్..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Dec 13 , 2024 | 12:54 PM