AP News: అరకులో నిలిచిన విద్యుత్
ABN, Publish Date - Jul 24 , 2024 | 10:36 AM
Andhrapradesh: జిల్లాలోని అరకులో విద్యుత్ సరఫరా నిలిచిచిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అరకు పరిసర ప్రాంతాలలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు విపరీతంగా వీస్తుండడంతో విద్యుత్ వైర్లపై చెట్లు కొమ్మలు పడుతుండడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు.
అల్లూరి జిల్లా, జూలై 24: జిల్లాలోని అరకులో (Araku) విద్యుత్ సరఫరా నిలిచిచిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అరకు పరిసర ప్రాంతాలలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు విపరీతంగా వీస్తుండడంతో విద్యుత్ వైర్లపై చెట్లు కొమ్మలు పడుతుండడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు.
రెండు రోజులుగా అరకు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో మంచి నీటి కోసం ప్రజలు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఫోన్లు మూగనోము పట్టాయి. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్, ఆన్‌లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
Budget Highlights : ఏపీ హ్యాపీ..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో అరకులోయ మండల పరిసర ప్రాంతంలో ఇటీవల భారీగా వర్షలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్ష ప్రభావంతో దాదాపు 100 కు పైగా లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని నాలుగు మండలాల్లోని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఇస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీటికి గోదావరి, కృష్ణా నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో పాటు ఈదురుగాలులు తోడవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Kamala Harris: పోల్ సర్వేల్లో ముందంజలో కమలా హ్యారీస్.. వెనుకబడ్డ ట్రంప్
GV Anjaneyulu: జగన్‌వి అన్నీ శవ రాజకీయాలే..
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 24 , 2024 | 10:40 AM