Vijayasaireddy ఉత్తరాంధ్రలో అసెంబ్లీ స్థానాలపై విజయసాయి సంచలన కామెంట్స్
ABN, Publish Date - Nov 07 , 2024 | 02:41 PM
Andhrapradesh: ఉత్తరాంధ్రలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలతో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అంతర్గత సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యల మీద పోరాటం చేస్తామన్నారు.
విశాఖపట్నం, నవంబర్ 7: ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలతో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy) గురువారం అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యల మీద పోరాటం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నామని.. స్టీల్ ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.
Pawan Kalyan: వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
విశాఖలో ఏర్పాటు చేసే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడకు తీసుకెళ్లారన్నారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది తమ ఉద్దేశమన్నారు. త్వరలో ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలు 44 స్థానాలకు పెరగనున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని... వారికి ఎటువంటి కష్టం రానివ్వమని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
విజయసాయి ఓ ఆటాడుకున్న బుద్దావెంకన్న
మరోవైపు విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డి అనే చిత్తకార్తి కుక్క మళ్లీ మొరగడం మొదలు పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర 34 సీట్లలో 32 సీట్లు కూటమి అభ్యర్ధులు గెలిచారని.. జగన్‌కు పాఠాలు నేర్పే ఆర్థిక నేరస్తుడు విజయసాయి వల్ల వైసీపీ రెండు సీట్లకే పరిమితం అయ్యిందన్నారు. శాంతి వ్యవహారంలో ప్రెస్టేషన్‌లో ఉన్నాడని తామూ వదిలేశామని.. శాంతితో డీల్ కుదిరి ఉంటుందని.. అందుకే ఇప్పుడు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. మీడియాలో ఉన్న చీఫ్ రిపోర్టర్లను కూడా ఇష్టం వచ్చినట్లు దూషించిన సంస్కారహీనుడన్నారు. కనీస జ్ఞానం లేని చదువుకున్న మూర్ఖుడు విజయసాయిరెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. ‘‘శాంతి భర్త నీ మీద చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతావు. ఆయన చెప్పిన అంశాలనే మీడియా కూడా రాసింది కదా’’ అని అన్నారు.
మంద కృష్ణమాదిగ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఎక్స్‌లో పోస్టు పెట్టారని... కూటమిలో చిచ్చు పెట్టాలని శకునిలా తాపత్రయ పడుతున్నారంటూ మండిపడ్డారు. బాలయ్య షో లో కూడా చంద్రబాబు తనకు పవన్‌పై ఉన్న అభిమానం ఎంతో చెప్పారన్నారు. 2027 లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని విజయసాయిరెడ్డి కలలు గంటున్నారని ఎద్దేవా చేశారు. జమిలీ ఎన్నికలపై ఇంకా చట్టం చేయలేదని.. పార్లమెంట్‌లో బిల్లు పాస్ అవ్వాలన్నారు. వైసీపీలో పెరిగిన వలసలు ఆపేందుకే ఈ చిత్తకార్తి కుక్క విజయసాయిరెడ్డి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి...
Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు..
Narayana: రాజధానికి భూములు.. రంగంలోకి దిగిన నారాయణ.. సక్సెస్ అయ్యేనా
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 07 , 2024 | 03:14 PM