ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: ఈనెల 27న వైసీపీ పోరుబాట.. పోస్టర్ విడుదల

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:22 PM

Andhrapradesh: 44 సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

YSRCP to protest against increase in current charges on 27th of December

విశాఖపట్నం, డిసెంబర్ 24: రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు పార్టీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 44 సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.

పోలీసుల ప్రశ్నలతో షాక్‌లో అల్లు అర్జున్‌


పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ‘‘మేము ఎన్డీఏ పక్షం కాదు, ఇండియా పక్షం కాదు. మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. మేము మొదటి నుంచి చెప్తున్నం జెమిలి ఎన్నికలు వస్తాయని. జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడిని. జేపీసీ ప్రతి రాష్ట్రంలోని పర్యటిస్తుంది. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుంది. జేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారు’’ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు


ఆరు నెలల్లో ఇంత అప్పా: అమర్నాథ్

పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారని.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేల కోట్లకు పైగా భారాన్ని మోపారన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. వచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్‌పై భారం పడుతుందన్నారు. ఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని.. సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్తు, విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

సెకనుకు రెండు బిర్యానీల డెలివరీ..

ప్రయాణికులకు అలర్ట్.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆలస్యం..

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 24 , 2024 | 01:36 PM