Vizianagaram: శ్రీ విద్యా పీఠంలో గురుపౌర్ణమి వేడుకలు
ABN , Publish Date - Jul 21 , 2024 | 04:54 PM
శ్రీరామనవమి.. శ్రీరాముడు, కృష్ణాష్టమి.. శ్రీకృష్ణుడు, వినాయకచవితి.. వినాయకుడు, శివరాత్రి.. మహాశివుడు, దుర్గాష్టమి.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ దుర్గమ్మ.. ఇలా ప్రతి ఒక్క పండగకు దేవుడో, దేవతలను పూజిస్తాం.
శ్రీరామనవమి.. శ్రీరాముడు, కృష్ణాష్టమి.. శ్రీకృష్ణుడు, వినాయకచవితి.. వినాయకుడు, శివరాత్రి.. మహాశివుడు, దుర్గాష్టమి.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ దుర్గమ్మ.. ఇలా ప్రతి ఒక్క పండగకు దేవుడో, దేవతకో పూజిస్తాం. కానీ గురు పౌర్ణమి మాత్రం అలా కాదు.. గురు సమానులైన వారికి కృతజ్జతలు తెలుపుకోవడమే ఈ పండగ అసలు సిసలు ఉద్దేశం. ఆషాఢమాసం తొలి పౌర్ణమి.. వ్యాసుడు జన్మించిన రోజు. వ్యాసుడు వేదాలు విభజించడంతో వేద వ్యాసుడయ్యాడు.
Also Read: Arvind Kejriwal: బీజేపీతోపాటు ఎల్జీపై మళ్లీ మండిపడ్డ ఆప్
అలాగే భారతం, భాగవతంతోపాటు బ్రహ్మసూత్రాలను సైతం ఆయన లిఖించి.. వ్యాస మహర్షిగా ఖ్యాతి గాంచారు. హిందూ ధర్మంలో కనిపించే పలు శాస్త్రాల వెనుక వ్యాసుడి కృషి ఎంతో ఉంది. అందుకే వ్యాసుడు సాక్షత్తూ శ్రీమహా విష్ణువు అంశ అంటారు. అంతేకాదు విష్ణు సహాస్ర నామాల్లో సైతం.. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని ఉంటుంది. అలా వ్యాస మహర్షి అందించిన జ్జానం గురువుల రూపంలో నేటికి విద్యార్థులకు అందుతొంది.
Also Read: New Delhi: జగన్ పాలనలో అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం
ఆ క్రమంలో ప్రతి వ్యాస పౌర్ణమి రోజు.. మన కళ్ల ముందున్న గురువులను, పెద్ద వారిని దైవ సమానులుగా భావించి పూజించి... వారి నుంచి దీవెనలు అందుకుంటాం. అందులోభాగంగా అభ్యాసకుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన కాంతులు ప్రసరించే గురువుని మనసారా కొలుచుకొవడం గురు పౌర్ణమి నాడు జరగటం.. అదీ సనాతనంగా వస్తున్న ఓ సంప్రదాయం.. ఈ వాసనలు విద్యల నగరమైన గజపతి మహరాజుల మాగాణీలో ఇంకా శోభిల్లుతూనే ఉంది.
జులై 21వ తేదీ ఆదివారం విజయనగరంలోని శ్రీ విద్యా పీఠంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే గురు శబ్ధం సకల శాస్త్ర స్వరూపం. ఇక గురు స్థానం సర్వోన్నతం. అందుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఇచ్చారు.
అలాంటి గురు శబ్దం.. కొన్ని సార్లు హేళనగా మారుతోంది. ఇంకా చెప్పాలంటే.. అగ్గిపెట్టుందా గురూ!, టైమ్ ఎంత అయింది గురూ, ఇదిగో టీ తీసుకో గురూ, ఓ వంద రూపాయిలుంటే అప్పు ఇవ్వు గురూ.. అంటూ గురు శబ్ధం ఊత పదంగా, నిత్య జీవితం ఒకింత హేళనగా మారింది. పరిస్థితులకు అనుగుణంగా ఈ పదం కొన్ని సందర్బాల్లో మారుతోంది. కానీ గురువు ఎప్పటికి గురువే. అందుకే క్షరం లేనిది అక్షరం. ఆ అక్షరం ఉన్నంత వరకు గురువు శబ్దం ఆచంద్రతారార్కం నిలిచే ఉంటుందన్నది సుస్పష్టం.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News