TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్

ABN, Publish Date - Nov 08 , 2024 | 06:14 PM

నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన, టీడీపీ నేతలతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, కేకే, చక్రవర్తి ఆధ్వర్యంలో రెండు గంటలసేపు చర్చించారు. నెల్లిమర్లలో మరోసారి ఎటువంటి వివాదాలు సృష్టించవద్దని, చిన్న, చిన్న విషయాలపై రచ్చ చేయవద్దని సూచించారు. వివాదాలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై..

TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్
Janasena VS TDP

ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు పార్టీల పెద్దలు దృష్టిసారించారు. దీంతో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బంగార్రాజును అమరావతికి పిలిపించారు. రెండు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు నియోజకవర్గం నాయకులతో చర్చించి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన, టీడీపీ నేతలతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, కేకే, చక్రవర్తి ఆధ్వర్యంలో రెండు గంటలసేపు చర్చించారు. నెల్లిమర్లలో మరోసారి ఎటువంటి వివాదాలు సృష్టించవద్దని, చిన్న, చిన్న విషయాలపై రచ్చ చేయవద్దని సూచించారు. వివాదాలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై పరిష్కరించుకోవాలని రెండు పార్టీల నాయకులకు చెప్పారు. జనసే, టీడీపీ కలయిక దీర్ఘకాలం ఉంటుందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో సమన్వయంతో ముందుకెళ్తున్న సమయంలో రెండు పార్టీల నాయకులు వివాదాలను సృష్టించడం సరికాదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కలిసిమెలసి పని చేసుకోవాలని పార్టీ పెద్దలు హితవు పలికారు. ఇకనుంచి ఎటువంటి వివాదాల జోలికి పోకుండా సమన్వయంతో పనిచేసుకుంటామని రెండు పార్టీల నాయకులు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Vasireddy Padma: పసలేని చట్టాలతో సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేం: వాసిరెడ్డి పద్మ


వివాదం ఏమిటి..?

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్‌ను కర్రోతు బంగార్రాజు ఆశించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కారణంగా నెల్లిమర్ల టికెట్ జనసేనకు కేటాయించారు. దీంతో టీడీపీ నాయకులు కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ కూటమి గెలుపు కోసం పనిచేశారు. ఫలితంగా భారీ మెజార్టీతో జనసేన అభ్యర్థి లోకం మాధవి గెలుపొందారు. అయితే ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో టీడీపీ నాయకులు సూచించిన ఉద్యోగులు ఒక్కరిని కూడా కోరుకున్న స్థానాలకు బదిలీ కాలేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీరుపై టీడీపీ నాయకులు కొంత అసంతృప్తితో ఉన్నారు.

AP News: సోషల్ మీడియా పోస్టింగ్స్.. వైసీపీ నేతను విచారిస్తున్న పోలీసులు


మరోవైపు ఉపాధి నిధులతో చేపట్టాల్సిన పనులను టీడీపీ నాయకులకు కాకుండా వైసీపీ మద్దతు కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే కేటాయించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనల నేపథ్యంలో అక్టోబర్ 30న నెల్లిమర్ల నగర పంచాయతీ సాధారణ కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బంగార్రాజు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం రాష్ట్ర స్థాయిలో వైరల్‌ అయింది. ఆ తర్వాత టీడీపీ శ్రేణులు నెల్లిమర్లలో సమావేశమై అసంతృప్తి గళం వినిపించడంతో గొడవ తార స్థాయికి చేరింది. దీంతో ఇరు పార్టీల అగ్రనేతలూ రంగంలోకి దిగి నియోజకవర్గ నాయకులను అమరావతికి పిలిచి మాట్లాడటంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.

YCP Kethi Reddy: ప్యాలెస్‌ను ఖాళీ చేయండి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫామ్ హౌస్‌కు నోటీసులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 08 , 2024 | 06:39 PM