ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Ramesh: అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరాం

ABN, Publish Date - Jun 21 , 2024 | 12:36 PM

ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదని.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చామని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఎంపీ సీఎం రమేష్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు.

అమరావతి: ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదని.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చామని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఎంపీ సీఎం రమేష్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు. మద్యం, ఇసుక మాఫియాల మీదే కాకుండా చాలా శాఖల్లో అవినీతి భారీ ఎత్తున జరిగిందన్నారు.


విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కేటాయిపుల్లోనూ అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయని సీఎం రమేష్ తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖలో కూడా అవినీతి జరిగిందన్నారు. శాఖల వారీగా అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో వెలికి తీయాలన్నారు. ఐదేళ్ల కాలంలో ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Updated Date - Jun 21 , 2024 | 12:36 PM

Advertising
Advertising