ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nimmala Ramanaidu: పోలవరంలో ఎవరు, ఎలా దోచారో విచారిస్తాం

ABN, Publish Date - Jun 20 , 2024 | 10:31 AM

జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్‌లలో తట్ట మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపించి మంత్రిని చేసిన 70 వేల నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.

అమరావతి: జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్‌లలో తట్ట మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపించి మంత్రిని చేసిన 70 వేల నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. కూటమి ద్వారా తన గెలుపునకు సహకరించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్‌కు పంటలను కాపాడేందుకు కాలువలో డిసిల్టింగ్‌కు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫ్లడ్ వచ్చినప్పుడు మెటీరియల్ ముందుగానే రిజర్వ్ చేసుకుంటామన్నారు.


వరదలు వస్తే తామే సంచులు తెచ్చుకొని గట్లను కపాడుకున్నామని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రానున్న ఫ్లడ్ విషయంలో ముందు నుంచి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదాతకు సేవ చేసే ఇరిగేషన్ లాంటి శాఖలను నిర్వీర్యం చేశారన్నారు. ఎన్‌టీఆర్, చంద్రబాబు నాయుడు ఇరిగేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేటాయించింది 30 వేలు కోట్లు మాత్రమేనని నిమ్మల తెలిపారు. పోలవరం ఏపీకి వరమని, జీవనాడి అని పేర్కొన్నారు. అందుకే గతంలో చంద్రబాబు 5 ఏళ్లపాటు అప్పట్లో సోమవారం పోలవరం‌గా మార్చారన్నారు. జగన్ పోలవరం పనులు చేయకపోగా 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్ళారన్నారు. చేసిన పనులు కూడా ధ్వంసం చేశారన్నారు.


‘‘చేసిన తప్పుకు కప్పి పుచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 2019 లో మీరు అధికారం లోకి వచ్చాక అక్కడి ఏజెన్సీలను ఎందుకు రద్దు చేశారు? అధికారులను ఎందుకు బదులు ఇచ్చారు?13 నెలలు ప్రాజెక్ట్ ను అధికారుల పర్యవేక్షణ లేకుండా చేశారు. ప్రాజెక్టు గుత్తేదారు మార్పు తగదని చెప్పినా కూడా చేసి ప్రాజెక్టును దెబ్బ తీశారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడం వెనుక గుత్తేదారు మార్పు కారణం. డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేసిన, నిర్మాణం చేసినంత ఖర్చు ఇప్పుడు అవుతుంది. డయాఫ్రమ్ వాల్ కొత్తది లేదంటే నిర్మించాల్సి వుంటుంది. భారత దేశం దుర్భిక్ష పరిస్థితులు పోవాలంటే నదుల అనుసంథానం మాత్రమే మార్గం. పోలవరంలో ఎంత డబ్బు.. ఎవరెలా దోచేశారో విచారిస్తాం.. తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టం. వెంటనే జలవనరుల శాఖ పరిస్థితిపై గత ప్రభుత్వ విధ్వంసంపై శ్వేత పత్రం విడుదల చేస్తాం’’ అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 10:31 AM

Advertising
Advertising