Visakhapatnam : రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు
ABN, Publish Date - Dec 06 , 2024 | 05:55 AM
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనిపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతోంది.
విశాఖపట్నం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనిపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతోంది. కాగా, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలులతో రాష్ట్రంలో గురువారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పశ్చిమ గోదావరి, శ్రీసత్యసాయి, కడప, కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కళింగపట్నంలో 20.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Updated Date - Dec 06 , 2024 | 05:55 AM