ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. భారీ వర్షం కురిసే ఛాన్స్..!

ABN, Publish Date - Mar 19 , 2024 | 09:17 AM

Rain Alert for Andhra Pradesh and Telangana: నిన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం(Weather) మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. నల్లటి దట్టమైన మబ్బులు కమ్మేశాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్ర ప్రకటించింది.

Weather Forecast

Rain Alert for Andhra Pradesh and Telangana: నిన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం(Weather) మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. నల్లటి దట్టమైన మబ్బులు కమ్మేశాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్ర ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవనుందని వెల్లడించింది. మార్చి 20వ తేదీ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలో ఉరుములు, మెరుపులు కూడిన వడగళ్ల వాన పడే ఛాన్స్ ఉందని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో..

19వ తేదీ నుంచి 21 వరకు తెలంగాణలో, కోస్తాంధ్ర యానాం ప్రాంతాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వర్షం నేపథ్యంలో రైతులు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు. పంటలు చేతికందే సమయం కావడంతో.. వర్షానికి పంట నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

దేశ వ్యాప్తంగా..

ఇదిలాఉంటే.. పశ్చిమ హిమాలయ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తె లిపారు. జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.

ఈశాన్య భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో మార్చి 19 నుండి 23 వరకు ఉరుములు మరియు మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 09:17 AM

Advertising
Advertising