Weather Alert: బాబోయ్.. ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు..
ABN, Publish Date - Dec 03 , 2024 | 04:34 PM
Andhra Pradesh Weather: ఏపీని ఓ వైపు ఫెంగల్ తుపాను భయపడుతుండగా.. మరో బాంబు పేల్చారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీకి ఫెంగల్ ముప్పు తక్కువే అయినా.. మరో ముప్పు పొంచి ఉందని ప్రకటించారు.
Andhra Pradesh Weather: ఏపీని ఓ వైపు ఫెంగల్ తుపాను భయపడుతుండగా.. మరో బాంబు పేల్చారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీకి ఫెంగల్ ముప్పు తక్కువే అయినా.. మరో ముప్పు పొంచి ఉందని ప్రకటించారు. డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుపానుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.
హడలెత్తిస్తున్న ఫెంగల్..
ఫెంగల్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం నాడు కూడా దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడుతాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఫెంగల్ తుపాను బలహీనపడుతోందని.. క్రమంగా అరేబియా సముద్రం వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఫెంగల్ తుపాను ఏపీపై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పొంచి ఉన్న మరో ముప్పు..
ఓవైపు ఫెంగల్ తుపాను ప్రభావం కొనసాగుతుండగానే.. మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. తీర ప్రాంత జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందంటున్నారు.
Also Read:
భార్యతో కలసి ధోని మాస్ డ్యాన్స్
మాజీ డిప్యూటీ సీఎంకు శిక్ష.. ఏంటంటే..
ఈ బీరువాను చోరీ చేయడం అంత ఈజీ కాదు..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Dec 03 , 2024 | 04:34 PM