Student Kidnap: ప్రేమిస్తున్నానంటూ యువతిని కిడ్నాప్ చేసిన యువకుడు..
ABN, Publish Date - Aug 15 , 2024 | 08:09 PM
పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన హనూక్ అనే యువకుణ్ని పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. అనంతరం యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి నిందితుణ్ని రిమాండ్‌కు తరలించారు.
పశ్చిమ గోదావరి: పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన హనూక్ అనే యువకుణ్ని పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. అనంతరం యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి నిందితుణ్ని రిమాండ్‌కు తరలించారు.
గొల్లల కోడేరు గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే హనూక్ అనే యువకుడు విద్యార్థిని పాఠశాలకు వెళ్లే సమయంలో రోజూ వెంబడించే వాడు. ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేస్తుండేవాడు. పెళ్లి చేసుకుంటానని చెప్తూ వెంటపడుతుండే వాడు. అయితే అతను చెప్పిన మాటలను బాలిక సున్నితంగా తిరస్కరించింది. గురువారం రోజున విద్యార్థిని బయటకు వెళ్లిన సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన హనూక్ ఆమెను వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయాడు.
బాలిక అరుపులు విన్న స్థానిక యువకులు కారును వెంబడించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా పాలకోడేరు వద్ద వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు విద్యార్థినిని రక్షించారు. అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హనూక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసులు, యువకులు కలిసి నిందితుణ్ని పట్టుకోకపోయుంటే బాలిక పరిస్థితి ఎలా ఉండేదో అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
Updated Date - Aug 15 , 2024 | 08:09 PM