TDP Activists: ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలి.. వీడియోలు వైరల్..
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:27 PM
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేముందు టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా మంగళవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో ఆళ్ల నాని భేటీ కానున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది.
అమరావతి: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (Ex Deputy CM, Alla Nani) టీడీపీ (TDP)లో చేరికపై ఆ పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్టీలో చేరేముందు టీడీసీ కార్యకర్తలకు (Activists) ఆళ్ల నాని క్షమాపణ (Apologize ) చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆయన క్షమాపణ చెప్పాలంటూ వరుస గ్రూపుల్లో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా మంగళవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు (CM Chandrababu)తో ఆళ్ల నాని భేటీ కానున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఆ భేటీ తర్వాత ఆళ్ల నాని చేరికపై క్లారిటీ రానుంది.
ఒకప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించడమేకాదు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఆ మేరకు పార్టీ పెద్దలతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇక లాంఛనంగా పార్టీలో చేరడమే. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వం కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు ఆయన చేరిక ఖాయం కానుంది. ఈ మేరకు జిల్లాలో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని టీడీపీ అధిష్ఠానం వర్తమానం ఇచ్చింది. ఆళ్ల నానితోపాటు మరో ఇద్దరు మాజీలు సైకిల్ ఎక్కేందుకే సిద్ధమవుతున్నారు.
వైసీపీ అధినేత జగన్ వైఖరిని నిరసిస్తూ వైసీపీలో ఇమడలేక రాజీనామా చేసిన నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. అలాంటి వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే ఏలూరు నియో జకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయింది. టీడీపీ లో చేరిపోగా ఇంతకుముందే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని నేడు సైకిల్ ఎక్కబోతున్నారు. రెండు నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వా నికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన కొద్దికాలం సైలెంట్‌గా ఉన్నారు. తరువాత హైదరాబాద్, మరికొన్ని రహస్య ప్రదేశాల్లో టీడీపీ నేతలతో భేటీ అవుతూ వచ్చారు. పైకి సమాచారం పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుం టూనే తెలుగుదేశంలో చేరేందుకు ఆళ్ల నాని తన శక్తియుక్తులను ఉపయోగించారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన టీడీపీలో చేరతారని కొన్నాళ్ల క్రితమే ప్రచారం సాగింది. చాలామంది ఇదే పంథా అనుసరించారు. స్థానిక టీడీపీ నాయకత్వం సైతం ఆళ్ల నాని టీడీపీలో చేరికను తోసిపుచ్చింది. తాము బలంగా ప్రజా మోదంతో గత ఎన్నికల్లో 62 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందితే పార్టీకి ఆళ్ల నాని అవసరం ఏమిటన్నట్టుగా కిందిస్థాయి కేడర్ వ్యాఖ్యానిం చారు. అయినప్పటికీ ఆళ్ల నాని మీడియా, స్థానిక నేతలెవరికీ ఫోన్‌లోకి సైతం టచ్‌లోకి రాలేదు. టీడీపీలో చేరతారన్న ప్రచారాన్ని ఖరారు చేసేం దుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. గడిచిన రెండు నెలలుగా టీడీపీలో ఓ ముఖ్య నేత ఆళ్ల నానికి మద్దతుగా నిలిచి ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి దాదాపు అన్ని రూట్లను క్లియర్ చేసినట్టు భావిస్తున్నారు. పార్టీ అధినా యకత్వం కూడా ఆళ్ల నాని విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించి తదుపరి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతర్గ తంగా ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వక పోయి నా పార్టీలో స్వచ్ఛందంగా చేరేందుకే నాని కూడా సమ్మతించినట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీ చైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో ఆందోళన
ర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్తత..
పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం..
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 03 , 2024 | 12:27 PM