Polavaram: సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటన
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:17 PM
2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళుతున్నారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సోమవారం పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పర్యటనకు (Visit) వెళ్లనున్నారు. భద్రత కారణాల రీత్యా పోలీసులు పాపికొండల విహారయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఆది, సోమవారం పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈరోజు పాపికొండల విహారయాత్ర కు వెళ్ళే 14 ప్రైవేట్ టూరిజం బోట్లు, ఒక టూరిజం బోటు తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
రెండోసారి పోలవరానికి..
2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళుతున్నారు. సీఎం అయ్యాక ఈ ఏడాది జూన్ 17న మెుదటిసారి ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు. కాగా, తాజాగా మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు.
అయితే ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకోనున్నారు. ముఖ్యంగా డయాఫ్రం వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజినీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అధికారులు అప్రమత్తం..
సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సిబ్బందికి పలు సూచనలు చేశారు. చంద్రబాబు వచ్చిన సమయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్ నుంచి చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. కాగా, సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీలతోపాటు స్థానిక అధికారులు, ఎంఈఐఎల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాలకృష్ణ, జానారెడ్డిలకు బిగ్ షాక్..
తల్లికి సాయం, తండ్రికి స్నేహం. అన్నదమ్ములకు ఆసరా
మహానందిలో చిరుతపులి సంచారం కలకలం..
అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం
జగిత్యాలలో ఆదివారం ఎమ్మెల్సీ కవిత పర్యటన
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 15 , 2024 | 12:17 PM