ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీలోకి ఆళ్ల నాని

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:35 AM

ఒకప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించడమేకాదు వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి జగన్‌ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు.

Alla Nani

నేడు అధినాయకత్వం కీలక నిర్ణయం

అదే దారిలో మరో ఇద్దరు మాజీలు

భారీ మెజార్టీతో గెలుపొందినా మళ్లీ వారెందుకంటున్న కేడర్‌

వైసీపీ మూలాలు కదిలించేందుకే ఈ నిర్ణయమంటున్న టీడీపీ నేతలు

ఒకప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించడమేకాదు వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి జగన్‌ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఆ మేరకు పార్టీ పెద్దలతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇక లాంఛనంగా పార్టీలో చేరడమే. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వం కూడా దాదాపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నేడు ఆయన చేరిక ఖాయం కానుంది. ఈ మేరకు జిల్లాలో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని టీడీపీ అధిష్ఠానం వర్తమానం ఇచ్చింది. ఆళ్ల నానితోపాటు మరో ఇద్దరు మాజీలు సైకిల్‌ ఎక్కేందుకే సిద్ధమవుతున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

వైసీపీ అధినేత జగన్‌ వైఖరిని నిరసిస్తూ వైసీపీలో ఇమడలేక రాజీనామా చేసిన నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. అలాంటి వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే ఏలూరు నియో జకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయింది. టీడీపీ లో చేరిపోగా ఇంతకుముందే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని నేడు సైకిల్‌ ఎక్కబోతున్నారు. రెండు నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వా నికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన కొద్దికాలం సైలెంట్‌గా ఉన్నారు. తరువాత హైదరాబాద్‌, మరికొన్ని రహస్య ప్రదేశాల్లో టీడీపీ నేతలతో భేటీ అవుతూ వచ్చారు. పైకి సమాచారం పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుం టూనే తెలుగుదేశంలో చేరేందుకు ఆళ్ల నాని తన శక్తియుక్తులను ఉపయోగించారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన టీడీపీలో చేరతారని కొన్నాళ్ల క్రితమే ప్రచారం సాగింది. చాలామంది ఇదే పంథా అనుసరించారు. స్థానిక టీడీపీ నాయకత్వం సైతం ఆళ్ల నాని టీడీపీలో చేరికను తోసిపుచ్చింది. తాము బలంగా ప్రజా మోదంతో గత ఎన్నికల్లో 62 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందితే పార్టీకి ఆళ్ల నాని అవసరం ఏమిటన్నట్టుగా కిందిస్థాయి కేడర్‌ వ్యాఖ్యానిం చారు. అయినప్పటికీ ఆళ్ల నాని మీడియా, స్థానిక నేతలెవరికీ ఫోన్‌లోకి సైతం టచ్‌లోకి రాలేదు. టీడీపీలో చేరతారన్న ప్రచారాన్ని ఖరారు చేసేం దుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. గడిచిన రెండు నెలలుగా టీడీపీలో ఓ ముఖ్య నేత ఆళ్ల నానికి మద్దతుగా నిలిచి ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి దాదాపు అన్ని రూట్లను క్లియర్‌ చేసినట్టు భావిస్తున్నారు. పార్టీ అధినా యకత్వం కూడా ఆళ్ల నాని విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించి తదుపరి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతర్గ తంగా ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వక పోయి నా పార్టీలో స్వచ్ఛందంగా చేరేందుకే నాని కూడా సమ్మతించినట్టు సమాచారం.

వైసీపీ ఆవిర్భావం నుంచి..

ఆళ్ల నాని వైసీపీ ఆవిర్భావం సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జగన్‌ నేతృత్వంలోని వైసీపీలో చేరారు. వైఎస్సార్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా గడిచిన రెండున్నర దశాబ్దాల నుంచి ఆయన కొనసాగుతూ వచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అంతలా వైసీపీలో ఆయన ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడి గా, విభజిత ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడమే కాకుండా ఎమ్మెల్సీగా కొన్నాళ్లు వ్యవహరించారు.

గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగో సారి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాల్లో సైలెంట్‌ అయ్యారు. పార్టీ అధినాయకత్వంతో ఆయన దాదాపు విభే దించారు. దానికి గల కారణాలేవీ ఇప్పటికీ బహి ర్గతం కాలేదు. ఆయన కూడా నోరువిప్పి ఎవరికీ చెప్పుకోలేదు. దీనికితోడు ఆళ్ల నానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఏలూరు మేయర్‌, మరి కొం దరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లో చేరారు. ఈ నేపథ్యంలో నాని తెలుగుదేశంలో చేరుతున్నట్టు సమాచారం అందింది. నేడు ఆయ న అధికారికంగా సైకిల్‌ ఎక్కబోతున్నారు. జిల్లాలో ని ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని టీడీపీ అధిష్ఠానం వర్తమానం పంపింది.

పెదవి విరిచిన కేడర్‌

ఏలూరులో ఎటువంటి అడ్డంకులు లేకుండా పార్టీ సభ్యత్వ నమోదు, పాలనా వ్యవహారాల్లో ఏకచత్రాధిపత్యంగా ఎమ్మెల్యే బడేటి చంటి, ఆయన వెంట ఉన్న కేడర్‌ ఉత్సాహంగా ఉన్నారు. ఆళ్ల నాని చేరిక అంటూ ప్రచారం జరిగినప్పుడే కేడరంతా దాదాపు వ్యతిరేకించారు. ఎమ్మెల్యే చంటి మాత్రం దీనిపై ఎక్కడా నోరు మెదపకుం డా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆళ్ల నానిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే తిరిగి వ్యవహారం మారుతుందన్న వాదనే అత్యధికుల్లో ఉంది.

మరో ఇద్దరు మాజీలు కూడా..!

మాజీ మంత్రి ఆళ్ల నానితో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై టీడీపీ దృష్టి పెట్టినట్టు సమాచారం. విభజిత పశ్చిమగోదావరి జిల్లాలోని ఇద్దరు మాజీలు చాలా కాలం క్రితమే వైసీపీకి రాంరాం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో దూరంగానే ఉంటున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ టీడీపీలో చేరే అవకాశాలు లేకపోలేదని కొందరు, ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరతారని ఇంకొందరు ప్రచారం ఆరంభించారు. అవునని, కాదని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఎక్కడా కొట్టిపారేయలేదు. జరుగుతున్న పరిణా మాలన్నింటినీ ఆయన చూస్తుండిపోయారు. ఒకానొక దశలో గ్రంధి శ్రీని వాస్‌ రాజకీయ ప్రస్థానంపైన దుమారమే చెలరేగింది. భీమవరంలో ఓటమి అనంతరం ఆయన వ్యక్తిగత పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవలే ఆయన కంపెనీలు, నివాస గృహంలో ఐటీ దాడులు సుదీర్ఘంగా సాగాయి. ఈ దాడుల్లో ఏం బయటపడిందనేది మాత్రం ఇప్పటిదాకా ఆదాయపు పన్ను శాఖ నిర్ధారించలేదు.. ప్రకటించ లేదు. ఈ దాడుల వ్యవహారంలో గ్రంధి, ఆయన అనుచరులు పూర్తిగా సైలెంట్‌గానే వ్యవహరించారు. ఈ దాడులకు ముందే ఆయన పార్టీ మారతారంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఆదిశగానే టీడీపీ దృష్టి పెట్టినట్టు సమాచారం. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. పనిలో పనిగా మరో మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు వైసీపీని వీడబోతున్నట్టు చాలా కాలం గానే ప్రచారం సాగుతూ వచ్చింది. జిల్లా లో సీనియర్‌ అయిన రంగనాథరాజు పట్ల అందరిలో సానుకూలత ఉంది. ఈ తరుణంలో ఆయనను పార్టీలోకి తీసుకో వడానికి టీడీపీ సన్నద్ధతలోనే ఉన్నట్టు చెబుతున్నారు. అటువైపు ఆళ్ల నాని, ఇటువైపు గ్రంధి, రంగనాఽథరాజును పార్టీలోకి తీసుకోవడం ద్వారా వైసీపీ మూలాలను పూర్తిగా కదిలించవచ్చనే కోణంలోనే టీడీపీ నాయకత్వం ఉంది. ఆ దిశగానే సంప్రదింపులు సాగుతున్నట్టు సమాచారం. విభజిత పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు అన్ని స్థానాల్లోను కూటమి ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలపైన దృష్టి పెట్టడానికి అనేక కారణాలు ఉన్నట్టు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలోనే కసరత్తు సాగుతుందని పార్టీ కూటమికి ఏదైతే కలి సొస్తుందో ఆ దిశగానే నిర్ణయాలు ఉంటాయని మరో వాదన చేస్తున్నారు. ఈ చేరికలను టీడీపీ కేడర్‌లో అత్యధికులు సానుకూలంగా తీసుకునే పరిస్థితిలేదు. గతంలో వైసీపీని ధీటుగా ఎదుర్కొని అనేక అక్రమ కేసులకు పార్టీ కేడర్‌ బలవ్వగా ఇప్పుడు ఆ పార్టీ నేతలనే తిరిగి పార్టీలో చేర్చుకుం టారన్న సంకేతాలతో టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది.

Updated Date - Dec 03 , 2024 | 07:12 AM