Minister Nimmala: అలాంటి వారికి త్వరలో రూ.15 వేల పింఛన్: మంత్రి నిమ్మల
ABN, Publish Date - Jun 30 , 2024 | 01:15 PM
ప.గో.జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మానవతా వాది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ప.గో.జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం (Pension Distribution Programme) చేపట్టిన మానవతా వాది స్వర్గీయ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) అని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన పాలకొల్లు (Palakollu)లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలుబెట్టుకుని విడతల వారిగా కాకుండా ఒకేసారి మొత్తం సొమ్మును అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని (CM Chandrababu Naidu) అన్నారు. గతంలో జగన్ (Jagan) విడతల వారిగా పింఛన్ల పెంపు వల్ల వికలాంగులు (Disabled People), దివ్యాంగులు, పేదలు అపారంగా నష్టపోయారన్నారు.
కాగా మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నవారికి త్వరలో రూ. 15 వేలు పింఛను అందించే ఆలోచన ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అందించే కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఖజానాను జగన్ ఖాళీ చేయడమే కాకుండా రూ. 12 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన ఉంచారని నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం ఎవరిపై ప్రేమ చూపిస్తున్నారో అర్థమౌతోంది
చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు..: ఎంపీ మిథున్ రెడ్డి
నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..
ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 30 , 2024 | 01:15 PM