Minister Nimmala: మంత్రి సాహసం.. స్వయంగా అక్కడికి ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి..
ABN, Publish Date - Jul 29 , 2024 | 02:55 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సరైన ఆహారం, మంచినీరు, విద్యుత్ సదుపాయం లేక ప్రజలు తీవ్రఅవస్థలు పడతున్నారు. పంటలు నీట మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సరైన ఆహారం, మంచినీరు, విద్యుత్ సదుపాయం లేక ప్రజలు తీవ్రఅవస్థలు పడతున్నారు. పంటలు నీట మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో బాధితులను పరామర్శించేందుకు ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) నిర్ణయించుకున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న పశ్చిమ గోదావరి జిల్లా వద్దిపర్రు గ్రామానికి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ ఆయన వెళ్లారు.
గుమ్మలూరు- వద్దిపర్రు ప్రధాన రహదారిపై వారం రోజులుగా ఐదు అడుగుల ఎత్తున వరదనీరు చేరడంతో గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో దాదాపు రెండు కిలోమీటర్లు మేర ట్రాక్టర్ నడుపుతూ గ్రామానికి చేరుకుని బాధితులను మంత్రి నిమ్మల పరామర్శించారు. తమ బాధలు స్వయంగా చూసేందుకు మంత్రి రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. నిమ్మల వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు.
Updated Date - Jul 29 , 2024 | 02:55 PM