Attack on RTC Driver: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి..
ABN, Publish Date - Aug 06 , 2024 | 08:22 AM
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఇటీవల కాలంలో తరచూ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులు చేసే వారిలో ఎక్కువగా ప్రయాణికులే ఉంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా కొంతమంది దుండగులు డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు.
ఏలూరు: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఇటీవల కాలంలో తరచూ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులు చేసే వారిలో ఎక్కువగా ప్రయాణికులే ఉంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా కొంతమంది దుండగులు డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు. కొవ్వూరు నుంచి వస్తున్న బస్సు సాంకేతిక కారణాలతో జంగారెడ్డిగూడెం అగ్నిమాపక కేంద్రం వద్ద నిలిచిపోయింది. డిపోకు సమాచారం ఇచ్చిన డ్రైవర్ పొలిమాటి బాబు సిబ్బింది కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే అదే సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు అపరిచితులు డ్రైవర్ వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు దొంగలు అతడిని పట్టుకోగా మరో వ్యక్తి డ్రైవర్ తలపై రాయితో కొట్టారు. తీవ్రగాయలై పడిపోయిన డ్రైవర్ వద్ద నుంచి ఫోన్ తీసుకుని పరారయ్యారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో డ్రైవర్ బాబుని జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో దుండగలు రెచ్చిపోయారు.
Updated Date - Aug 06 , 2024 | 08:22 AM