ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YCP Leaders : శ్రీకాకుళంలో టీడీపీ నేత హత్యకు సుపారీ

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:04 AM

తమ రియల్‌ అక్రమాలకు, సోషల్‌ మీడియా వికృత పోకడలకు అడ్డుగా నిలిచిన టీడీపీ నేత హత్యకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారు.

  • బిహారీ గ్యాంగ్‌కు 10 లక్షలకు పైగా ఇచ్చిన వైసీపీ నేతలు?

  • ముఠాతో పాటు పోలీసుల అదుపులో ఇద్దరు నాయకులు

  • వారిని విడుదల చేయాలంటూ స్టేషన్‌లో సీదిరి వీరంగం

పలాస, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): తమ రియల్‌ అక్రమాలకు, సోషల్‌ మీడియా వికృత పోకడలకు అడ్డుగా నిలిచిన టీడీపీ నేత హత్యకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారు. అందుకు సుపారీ ఇచ్చి బిహారీ గ్యాంగ్‌ను రప్పించారు. వరుస అరెస్టులతో వెలుగులోకి వచ్చిన ఈ సమాచారంతో పలాస ఉలిక్కిపడింది... శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేగింది.

కుట్రకు కారణం ఇది...

బీ నాగరాజు... చిన్నబడాంలో నివాసం ఉంటున ్న ఆయన పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు. గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతల అక్రమాలపై వెన్ను చూపకుండా పోరాటం చేశారు. ఈ క్రమంలో గాయపడ్డారు. అరెస్టు అయ్యారు. ఆయనకు సంఘీభావం ప్రకటించిన నాటి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, గౌతు శిరీష, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తదితరులు కూడా అరెస్టు అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న వైసీపీ నేతల రియల్‌ అక్రమాలకు నాగరాజు పెద్ద అడ్డంకిగా మారారు. దీనితో ఆయనను భౌతికంగా తొలగించాలని వైసీపీ నేతలు నిర్ణయించుకున్నారు.

ప్లాన్‌ బయటపడింది ఇలా...

టెక్కలిలో అనుమానాస్పదంగా కనిపించిన బిహార్‌కు చెందిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో వారిని ప్రశ్నించారు. దీంతో అసలు స్కెచ్‌ బయట పడింది. నాగరాజు హత్యకు వీరికి రూ.10 లక్షలకు పైగా సుపారీ అందినట్లు, పోలీసులకు వీరి వద్ద మారణాయుధాలు లభించినట్లు సమాచారం. హత్యకు పథక రచన వెనుక చిన్నబడాంకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాను, మందస మండలం వరదరాజపురం గ్రామానికి చెందిన వైసీపీ నేత (ఈయన ప్రస్తుతం పలాస ప్రభుత ్వ జూనియర్‌ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు) ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వీరిద్దర్ని పోలీసులు విచారణకు తీసుకెళ్లినట్లు సమాచారం.


పోలీస్‌స్టేషన్‌ వద్ద హైడ్రామా!

విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హుటాహుటిన డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ నేతలను విడుదల చేయాలంటూ గలాటాకు దిగారు. పోలీసులు అక్కడినుంచి పంపించివేయడంతో కాశీబుగ్గపోలీస్‌ స్టేషన్‌కు చెరుకుని ఆందోళనకు దిగారు.

నోరు విప్పని ఖాకీలు...

మరోవైపు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఏఎస్పీ(క్రైమ్‌) పి.శ్రీనివాసరావు ఆదివారం అర్ధరాత్రి హుటాహుటిన టెక్కలి పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. బిహార్‌ గ్యాంగ్‌ విచారణను వారు స్వ యంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం పై ఇప్పటి వరకూ పోలీసులు నోరు విప్పలేదు. అయితే కాశీబుగ్గ సీఐ డీ మోహనరావు మీడియాతో మాట్లాడుతూ... ‘బి హార్‌ గ్యాంగ్‌ జిల్లాలో ఓ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దొరికింది. ఇంకా పూర్తి సమాచారం రాలేదు. తొందరలోనే మొత్తం సమాచారం మీడియాకు అందిస్తాం’ అంటూ ముక్తసరిగా చెప్పారు.

Updated Date - Dec 17 , 2024 | 04:04 AM