YSRCP: వైసీపీ రౌడీ మూకల అరాచకం.. జనసేన కోసం పని చేస్తున్నాడని..
ABN, Publish Date - May 27 , 2024 | 08:09 AM
మచిలీపట్నంలో వైసీపీ రౌడీ మూకల అరాచకం మరోసారి వెలుగు చూసింది. జనసేన నాయకుడు కర్రి మహేష్ కారును వైసీపీ నేతలు తగుల బెట్టారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తగుల పెట్టడంతో ఆవేదనకు గురైన మహేష్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. అర్ధరాత్రి రెండు గంటల తరువాత తన కారును వైసీపీ గూండాలు తగుల పెట్టారని తెలిపారు.
విజయవాడ: మచిలీపట్నంలో వైసీపీ (YSRCP) రౌడీ మూకల అరాచకం మరోసారి వెలుగు చూసింది. జనసేన నాయకుడు కర్రి మహేష్ కారును వైసీపీ నేతలు తగుల బెట్టారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తగుల పెట్టడంతో ఆవేదనకు గురైన మహేష్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. అర్ధరాత్రి రెండు గంటల తరువాత తన కారును వైసీపీ గూండాలు తగుల పెట్టారని తెలిపారు. ‘జగన్మోహన్ రెడ్డి ని మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా? జనసేనను అభిమానిస్తే ఇలా చేస్తారా?’ అంటూ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం పని చేస్తే తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు.
Jagan Govt : గల్లా పెట్టెలు ఖాళీ
గతంలో కూడా అర్ధరాత్రి మా ఇంటిపై పడి దాడి చేశారని మహేష్ వెల్లడించారు. తమను కొట్టి, చంపాలని చూశారని కేసు పెట్టామన్నారు. ఒక్క రోజులో వాళ్లంతా బయటకి వచ్చి దర్జాగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు తన కారును తగులబెట్టి రాక్షసానందం పొందారన్నారు. ఆ మంటలు తమ ఇంటి గోడ వైపు సైతం వ్యాపించాయన్నారు. వంట గది అటే ఉందని... ప్రమాదం జరిగితే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లమని అన్నారు. తాను వైసీపీ వాళ్లను తిట్టలేదని.. వాళ్లతో గొడవకి వెళ్లలేదని మహేష్ అన్నారు. తాను మాత్రం పవన్ కల్యాణ్‌పై అభిమానంతో జనసేన కోసం పని చేస్తున్నానని తెలిపారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోక పోవడం వల్లే వైసీపీ వాళ్లు దాడులుకు తెగ పడుతున్నారని మహేష్ ఆరోపించారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
Updated Date - May 27 , 2024 | 08:09 AM