ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఐడీ కేసులో హైకోర్టుకు విక్రాంత్‌రెడ్డి

ABN, Publish Date - Dec 06 , 2024 | 03:39 AM

తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ బాబాయి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

  • ముందస్తు బెయిల్‌ మంజూరుకు వినతి

  • దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధం

  • కేవీరావు ఆరోపణలకు ఆధారాల్లేవు

  • జగన్‌ను అపఖ్యాతి పాల్జేయడానికే ఫిర్యాదు

  • షేర్‌ హోల్డింగ్‌ కంపెనీలన్నీ హైదరాబాద్‌లోనే

  • షేర్ల బదలాయింపు జరిగింది అక్కడే

  • కేసు నమోదుచేసే అధికార పరిధి

  • మంగళగిరి సీఐడీ పోలీసులకు లేదు

  • దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధం

  • పిటిషన్‌లో వైవీ సుబ్బారెడ్డి కుమారుడి వెల్లడి

అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ బాబాయి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. వాటాల బదలాయింపు వ్యవహారంలో తనకెలాంటి పాత్రా లేదని అందులో తెలిపారు. తన తండ్రి జగన్మోహన్‌రెడ్డి బంధువు, ఎంపీ అయినందున ఆయన రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసం తనపై ఫిర్యాదు చేశారని.. కేసు కూడా పెట్టారని పేర్కొన్నారు. ‘జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన్ను అపఖ్యాతిపాల్జేసేందుకే ఫిర్యాదు చేసినట్లు కనపడుతోంది. ఘటన జరిగిన నాలుగున్నరేళ్ల తర్వాత ఎందుకు కేసు పెట్టారో కారణాలను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు. ఫిర్యాదులో కేవీరావు చేసిన ఆరోపణలకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లేవు. ప్రాథమిక విచారణ జరిపి ఫిర్యాదు వాస్తవికతను నిర్ధారించకుండానే సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్‌ హోల్డింగ్‌ కంపెనీలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.


షేర్ల బదలాయింపు ప్రక్రియ మొత్తం అక్కడే జరిగింది. కేసు నమోదు చేసేందుకు మంగళగిరి సీఐడీ పోలీసులకు ఎలాంటి అధికార పరిధీ లేదు. ఇది నేర విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. కేసు నమోదు వెనుక అధికార పార్టీ ప్రోద్బలం ఉంది. ప్రభుత్వానికి రూ.1,000 కోట్లు ఎగ్గొట్టారంటూ తప్పుడు ఆడిట్‌ రిపోర్ట్‌ ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఆడిట్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు ఎలాంటి కంప్లయింటూ ఇవ్వలేదు. వాటాల బదలాయింపు కోసం తనను, కుటుంబ సభ్యులను బెదిరించారని చేసిన ఆరోపణకు కేవీరావు ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదు. బీఎన్‌ఎస్‌ చట్టం సెక్షన్‌ 111 (వ్యవస్థీకృత నేరం) కింద నాపై కేసు నమోదు చెల్లుబాటు కాదు. నాకెలాంటి పూర్వ నేరచరిత్రా లేదు. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధం.

కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటాను. నన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లుకవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు అరెస్టు చేస్తే పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. నా పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించేంతవరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండి’ అని పిటిషన్‌లో అభ్యర్థించారు. తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయింపు చేశారని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కేవీఆర్‌ గ్రూపులకు చెందిన కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 2న మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏ-1గా వై విక్రాంత్‌రెడ్డి, ఏ-2గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏ-3గా శరత్‌చంద్రారెడ్డి, ఏ-4గా పీకేఎఫ్‌ శ్రీఽధర్‌ అండ్‌ సంతానం ఆడిట్‌ కంపెనీ, ఏ-5గా అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను చేర్చారు.

Updated Date - Dec 06 , 2024 | 03:40 AM