ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: ఒక్కొక్కటిగా పడుతున్న వైసీపీ వికెట్స్.. నెల్లూరు మేయర్ రాజీనామా ప్రకటన

ABN, Publish Date - Jun 10 , 2024 | 02:01 PM

ఏపీ ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ వికెట్స్ ఒక్కొక్కటిగా పడుతున్నాయి. ఇవాళ నెల్లూరు మేయర్ స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్ టికెట్‌ను ఇచ్చారని.. గెలిచిన మీదట తనను మేయర్‌ను చేశారని తెలిపారు.

నెల్లూరు: ఏపీ ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ వికెట్స్ ఒక్కొక్కటిగా పడుతున్నాయి. ఇవాళ నెల్లూరు మేయర్ స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్ టికెట్‌ను ఇచ్చారని.. గెలిచిన మీదట తనను మేయర్‌ను చేశారని తెలిపారు. మాలాంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారన్నారు. రాజకీయాల్లో తనకు ధైర్యాన్ని ఇచ్చారని స్రవంతి తెలిపారు.


శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కూడా ఆయసతోనే ఉంటానని స్పష్టం చేశానని వెల్లడించారు. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైసీపీలోకి వెళ్ళాల్సి వచ్చిందని.. శ్రీధర్ రెడ్డి పై విమర్శలు చేయాలని అక్కడి నాయకులు తమపై ఒత్తిడి తెచ్చారని స్రవంతి తెలిపారు. అయినా సరే.. శ్రీధర్ రెడ్డిని ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. మా తప్పులను శ్రీధర్ రెడ్డి మన్నించి మమ్ములను అక్కున చేర్చుకోవాలని కోరుకుంటున్నామని స్రవంతి అర్థించారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 02:01 PM

Advertising
Advertising