ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: టీడీపీపై జగన్ పార్టీ ఫేక్ ప్రచారం

ABN, Publish Date - Apr 07 , 2024 | 05:41 PM

వరుసగా రెండో సారి అధికారం అందుకొనేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. అలాగే కడప లోక్‌సభ స్థానాన్ని సైతం కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుతోంది. అయితే కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల బరిలో దిగారు. దీంతో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది.

YS Jagan

కడప, ఏప్రిల్ 07: వరుసగా రెండో సారి అధికారం అందుకొనేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. అలాగే కడప లోక్‌సభ స్థానాన్ని సైతం కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుతోంది. అయితే కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల బరిలో దిగారు.

దీంతో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. ఆ క్రమంలో ఎంపీగా బరిలో దిగిన వైయస్ షర్మిలకు టీడీపీ మద్దతు ఇస్తుందంటూ.. ఆ పార్టీ లెటర్ హెడ్‌‌తో కూడిన ఓ ప్రకటన వైరల్ అవుతోంది. అలాగే టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ మీడియాలో ఈ కథనం ప్రసారం అయిందంటూ.. అధికార వైసీపీ ఓ ఫేక్ ప్రచారాన్ని చేపట్టింది.

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?

దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని ఎన్నికల బరిలో దింపామని ఈ సందర్బంగా గుర్తు చేసింది. అలాంటి వేళ తమ అభ్యర్థిని బరిలో దింపి అతడిని కాదని.. మరొకరికి ఎలా మద్దతు ఇస్తామని అధికార వైసీపీని టీడీపీ ప్రశ్నిస్తోంది.


ఆ క్రమంలో తప్పుడు ప్రచారం తలకెత్తుకొన్న అధికార వైసీపీపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. పులివెందుల్లో నువ్వు ఓడిపోవడం ఖాయమని సీఎం వైయస్ జగన్‌కి టీడీపీ ఈ సందర్భంగా స్పష్టం చేస్తోంది.

సొంత చిన్నాన్నా వైయస్ వివేకా హత్య విషయంలో జిల్లా ప్రజలు నీకు బుద్ది చెప్పడం మాత్రం పక్కా అని పేర్కొంటుంది. కడప లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలకు గండి కొట్టేందుకే వైసీపీ ఈ తరహా చర్యలు చేపట్టిందని మండిపడుతోంది. వైసీపీ ఫేక్ ప్రచారంపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా టీడీపీ స్పష్టం చేసింది.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం..

Updated Date - Apr 07 , 2024 | 06:49 PM

Advertising
Advertising