ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల

ABN, Publish Date - Nov 30 , 2024 | 06:07 PM

అదానీతో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో సోలార్ విద్యుత్ ఒప్పందాలపై ఆ పార్టీ నేతలకు, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్దం సాగుతుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఆర్కే రోజా శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆర్కే రోజా స్పందనపై వైఎస్ షర్మిల శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా కాస్తా చురకలంటిస్తూ స్పందించింది.

AP PCC Chief YS Sharmila

అమరావతి, నవంబర్ 30: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్కాం చేశారంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపణలపై మాజీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం తన ఎక్స్ వేదికగా కాస్తా ఘాటుగా స్పందించారు. అయితే ఆర్కే రోజా స్పందనపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తన ఎక్స్ వేదికగా శనివారం మరింత ఘాటుగా స్పందించారు. వైఎస్ షర్మిల ఏమన్నారంటే.. గౌరవ మాజీ మంత్రి రోజా గారు.. ఇంతకు ఇది మీ రాతలా? సాక్షి పంపిన స్క్రిప్టా? లేక సకల శాఖ మాజీ మంత్రి రాసిందా? అంటూ ఆర్కే రోజాను వ్యంగ్యంగా ప్రశ్నించారు. తెర వెనుక దాక్కొని మిమ్మల్ని ముందుపెట్టి అబద్ధాలను అందంగా వర్ణించే వాళ్లను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తుందన్నారు.


  • 1) దేశంలో సోలార్ విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గుతుంటే 25 ఏళ్ల కాంట్రాక్ట్ ఎందుకు చేశారు. 5 ఏళ్ల తర్వాత రూ 1.50 పైసలకే యూనిట్ ధర వచ్చునేమో కదా..?

  • 2) ఇతర రాష్ట్రాల ఒప్పందాలను సమీక్షించకుండా ఏకపక్షంగా అదానీ వద్ద రూ.2.49 పైసలకు ఎందుకు కొన్నారు? అదానీ మీద మీకు అంత ప్రేమ ఎందుకు? 2020 ఏడాది గుజరాత్‌లో సోలార్ యూనిట్ ధర కేవలం రూ1.99 పైసలు మాత్రమే. మరి వెనకబడిన మన రాష్ట్రం అదానీ వద్ద 2021లో 50 పైసలు ఎక్కువ పెట్టీ ఎందుకు కొనాల్సి వచ్చింది ? ఇది రాష్ట్రం నెత్తిన అధిక భారం మోపినట్లు కాదా?

  • 3) అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో ట్రాన్స్మిషన్ చార్జీలు లేవని... రూ 2.49 పైసలకే యూనిట్ ధర పడిందని చెప్పినా వీలింగ్ ఛార్జీలు, GST అన్ని కలిపి యూనిట్‌కి రూ.4.16 పైసలు పడుతుందని విద్యుత్ రంగ అధికారులే చెప్తున్నారు.. మరి ఇది నిజం కాదా?

  • 4) 2021లో సెకీ, NTPC సంస్థలు 20 గిగావాట్ల సోలార్ విద్యుత్‌కి పిలిచిన టెండర్లలో రూ.2.14 పైసలకే పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్న సంగతి మీకు తెలియదా?

  • 5)2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టీపీ సౌర్యా అనే సోలార్ కంపెనీ రూ.2.14 పైసలకు, ఏఐ జోమయ్య అనే కంపెనీ రూ.2.15 పైసలు కోట్ చేసిన సంగతి మీరు గమనించ లేదా?

  • 6) 2021లో రాజస్థాన్‌లో NTPC రెన్యువల్ ఎనర్జీ 1750 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం పిలిచిన టెండర్లలో యూనిట్ ధర రూ.2.17 పైసలకు ఇచ్చేందుకు ముందు కొచ్చిన సంగతి మీరు చూడ లేదా?

  • 7) గుజరాత్‌లో రూ1.99 పైసలు, రాజస్థాన్‌లో రూ 2.17 పైసలు, మధ్యప్రదేశ్‌లో రూ 2.14 పైసలు, మరి అదే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.2.49 పైసలు పెట్టి కొనడం తక్కువ ధరనా? ఇదెక్కడి బంపర్ ఆఫర్?

  • 8) చంద్రబాబు హయాంలో సోలార్ పవర్‌కి ఎక్కువ పెట్టి కొన్నారంటున్నారు. 2019లో మీరు అధికారంలో వచ్చాకా? దానిపై ఎందుకు దర్యాప్తు జరిపించ లేదు? టెండర్లు రద్దు చేశారు సరే.. మరి దాని వెనుక మర్మం ఏంటో విచారణ చేయాలి కదా? 5 ఏళ్లు అధికారంలో ఉండి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? అటు తిప్పి, ఇటు తిప్పి ఇంగ్లీష్‌లో చెప్పినా, తెలుగులో చెప్పినా నిజాన్ని మాత్రం దాచ లేరు. అమెరికా దర్యాప్తు సంస్థల కళ్లు మూయ లేరు. అదానీ దగ్గర మీరు రూ.1750 కోట్లు లంచాలు తీసుకున్నది వాస్తవం. దేశంలో ఎవడు కొనని అదానీ సోలార్ పవర్‌ను ముడుపుల కోసం మీరు కొన్నది వాస్తవం కాదా?. అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.


ఇంతకీ ఆర్కే రోజా శుక్రవారం ఏమన్నారంటే..?

వైఎస్ షర్మిల.. మీకు తెలుగు అర్థం కాదా.. ఇంగ్లీష్ అర్థం కాదా.. నిన్న మీ అన్న రెండు భాష‌ల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివ‌రాలు ఇచ్చారు. అయినా స‌రే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు ప‌ట్టుకుని మీరు మ‌ళ్లీ ఒక వితండ‌వాద‌న‌తో తిరిగి వైఎస్ జ‌గ‌న్ మీద బుర‌ద జ‌ల్లుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు.


అలాగే అదానీ సంస్థతో గతంలో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై పలు అంశాలను ఆర్కే రోజా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్కే రోజా ప్రశ్నలకు వైఎస్ షర్మిల తనదైన శైలిలో ఆమెకు ప్రశ్నలు సంధించింది. మరోవైపు అదానీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 06:07 PM