ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila : ఆస్తులు లాక్కోవడం జగన్‌ ప్రభుత్వం ట్రెండ్‌

ABN, Publish Date - Dec 04 , 2024 | 05:15 AM

ఆస్తులు లాక్కోవడం జగన్‌ సర్కారుకు అలవాటేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. జగన్‌ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌ అయితే..

  • కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను అప్పట్లో గుంజుకున్నారు

  • గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారు

  • వాటిపై మౌనంగా ఉండటం కూటమి ప్రభుత్వం ట్రెండ్‌గా మారింది: పీసీసీ చీఫ్‌ షర్మిల

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఆస్తులు లాక్కోవడం జగన్‌ సర్కారుకు అలవాటేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. జగన్‌ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌ అయితే.. వాటిని చూసీ చూడనట్లుగా వదిలేయడం కూటమి ప్రభుత్వానికి ట్రెండ్‌గా మారిందని మంగళవారం ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ‘‘అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపైనా కనీసం చర్య కూడా లేదు. రాష్ట్రంలో కాకినాడ పోర్టుతో సహా.. కృష్ణపట్నం పోర్టునూ అప్పట్లో గుంజుకున్నారు. ప్రభుత్వాధీనంలోని అత్యధిక లాభాలు గడిస్తున్న గంగవరం పోర్టునూ అప్పనంగా అమ్మేశారు. ఏపీని పోర్టులకు హబ్‌లుగా మార్చే పాలసీలు సరే.. మరి గంగవరం పోర్టు మాటేమిటి. ఏటా దాదాపు రూ. 2,000 కోట్ల లాభాలు గడించే పోర్టును వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసిచ్చేసింది. నికర ఆర్థిక నిల్వలతో పాటు రూ. 9,000 కోట్లు విలువచేసే 10 శాతం వాటాలను కేవలం రూ. 640 కోట్లకే అమ్మేశారు. బీవోటీ కింద మరో పదిహేనేళ్లలో ప్రభుత్వ పరం అవ్వాల్సిన పోర్టు అది. ఎలాంటి టెండర్లు లేకుండానే అదానీకి జగన్‌ కట్టబెట్టేశారు. పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగపడతాయని జగన్‌ బుకాయించారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై కూటమి పక్షాలు చెప్పిన మాటలకు.. చేస్తున్న విధానాలకూ పొంతనే లేదు’’ అని షర్మిల విమర్శించారు.

Updated Date - Dec 04 , 2024 | 05:15 AM