YS Vijayamma: మీకు దండం పెడతా.. విజయమ్మ భావోద్వేగం..
ABN, Publish Date - Oct 29 , 2024 | 07:34 PM
YSR Property Issue: వైఎస్ఆర్ ఆస్తుల పంపకం వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల ఈ అంశంపై పలు దఫాలుగా మాట్లాడగా.. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎంటరయ్యారు. ఆస్తుల విషయంలో జగన్‌దే తప్పు అని క్లారిటీ ఇస్తూ..
YSR Property Issue: వైఎస్ఆర్ ఆస్తుల పంపకం వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల ఈ అంశంపై పలు దఫాలుగా మాట్లాడగా.. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎంటరయ్యారు. ఆస్తుల విషయంలో జగన్‌దే తప్పు అని క్లారిటీ ఇస్తూ.. సంచలన లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదంపై ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబం గురించి ఎవరు పడితే వారు మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. రెండు చేతులు జోడించి మొక్కుతానంటూ వేడుకున్నారు. మరోసారి తమ కుటుంబం గురించి ఎవరూ మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు విజయమ్మ.
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల పంపాలకు సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో వారి తల్లి విజయమ్మ సంచలన లేక విడుదల చేశారు. జరుగుతున్న వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేస్తూనే.. అసలు జరిగిందేంటో వెల్లడించారు. ఈ లేఖలో ఆమె రాశారంటే..
‘రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ అభ్యర్థిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాధ కలుగుతోంది. పెద్దలంటారు.. ఇంటి గుట్టును రట్టు చేస్తారు. తమ జీవితం తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ అనేవారు. అయితే, ఇలా కాదు. చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లం. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి అన్నీ నా కళ్లముందే జరిగిపోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చిన్టలు వాళ్లు మాట్లాడుతున్నారు. అబద్దాల పరంపర కొనసాగుతోంది. తెలిసి కొంత.. తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులెత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. నేను నమ్మిన దేవుడే నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం.’ అంటూ తీవ్ర భావ్వోదేగంతో లేఖ రాశారు.
Also Read:
సంచలన విషయాలు బయటపెట్టిన వైఎస్ విజయమ్మ
క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ.. అసలేమైందంటే..
కోహ్లీతో కోల్డ్‌వార్.. ఇన్నేళ్లకు రివీల్
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Oct 29 , 2024 | 08:11 PM