ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jobs Scam : ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్లు దండుకున్న వైసీపీ నేతలు

ABN, Publish Date - Dec 18 , 2024 | 05:20 AM

గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వైసీపీ నేతలు రూ.కోట్లు దండుకున్నారని పలువురు నాయీ బ్రాహ్మణులు టీడీపీ నేతలకు..

  • టీడీపీ గ్రీవెన్స్‌లో గొల్లుమన్న బాధితులు

అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వైసీపీ నేతలు రూ.కోట్లు దండుకున్నారని పలువురు నాయీ బ్రాహ్మణులు టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు షరీఫ్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, సీడాప్‌ చైర్మన్‌ దీపక్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అర్జీలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ చైర్మన్‌గా ఉన్న యానాదయ్య, మరికొందరు తమకు ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా రూ.10 కోట్లు కాజేశారని కోనసీమ జిల్లా అప్పనపల్లి దేవస్థానంలో కేశఖండనశాలలో పని చేస్తున్న నాయీ బ్రాహ్మణులు ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన బద్వేల్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ తమ భూమిని ఆక్రమించుకుని, అక్రమ నిర్మాణాలు చేపట్టాడని, తనకు కోర్టు స్టే ఇచ్చినా అక్రమ నిర్మాణాలు ఆపడం లేదని బద్వేల్‌కు చెందిన ఎం సుధాకర్‌ ఫిర్యాదు చేశారు. తన పొలంలోకి తనను వెళ్లనీయకుండా సీఐ చిన్నకోటయ్య, కానిస్టేబుల్‌ మునీంద్ర అడ్డుకుని, అక్రమ కేసు పెట్టారని కర్నూలు జిల్లా వరిముక్కలకు చెందిన హరికృష్ణ వాపోయారు. విజయవాడలోని గంగానమ్మ ఆలయ కార్యదర్శి గురుమూర్తి దేవుని సొమ్ము రూ.10 లక్షలు కాజేశారని, చర్యలు తీసుకోవాలని ఆలయకమిటీ సభ్యులు కోరారు.

Updated Date - Dec 18 , 2024 | 05:20 AM