ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Wine Shop Tenders 2024: వైసీపీ నేతల నయా స్కెచ్..!

ABN, Publish Date - Oct 08 , 2024 | 12:54 PM

AP Wine Shop Tenders 2024: జిల్లాలో కొత్త మద్యం దుకాణాలపై గుత్తాధిపత్యానికి అప్పుడే నేతలు అడ్డదార్లు తొక్కుతున్నారు. లాటరీలో ఎవరు షాపులు దక్కించుకున్నా వాటి ఏర్పాటు తమ గుప్పిట్లోనే ఉండేలా పన్నాగాలుపన్నుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో మద్యం షాపులపై అప్పుడే గద్దల్లా వాలిపోతూ దుకాణాలన్నీ ముందే వశం చేసేసుకుంటున్నారు. అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు కూడా రాసేసుకుంటున్నారు.

AP Wine Shop Tenders 2024

AP Wine Shop Tenders 2024: జిల్లాలో కొత్త మద్యం దుకాణాలపై గుత్తాధిపత్యానికి అప్పుడే నేతలు అడ్డదార్లు తొక్కుతున్నారు. లాటరీలో ఎవరు షాపులు దక్కించుకున్నా వాటి ఏర్పాటు తమ గుప్పిట్లోనే ఉండేలా పన్నాగాలుపన్నుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో మద్యం షాపులపై అప్పుడే గద్దల్లా వాలిపోతూ దుకాణాలన్నీ ముందే వశం చేసేసుకుంటున్నారు. అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు కూడా రాసేసుకుంటున్నారు. లాటరీలో షాపులు దక్కించుకున్నవారికి ఎక్కడా దుకాణం దొరకకుండా సిండికేట్ నడుపుతున్నారు. కాకినాడ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆదేశాలతో ఆయన అనుచరులు ఒక్కో దుకాణానికి అద్దె అడ్వాన్సులు సైతం ఇచ్చేశారు. లాటరీలో షాపు వచ్చిన వారు రద్దీ ప్రాంతాల్లో ఎక్కడా దుకాణానికి స్థలం దొరక్క తమ వద్దకే వచ్చి తీరాలని, తద్వారా అందులో వాటా కొట్టేయడానికి పావులు కదుపుతున్నారు. పెద్దాపురంలో ఓ వైసీపీ నేత అన్ని పాత దుకాణాలను మూడు నెలల ముందే అద్దెలకు తీసేసుకుని గుప్పిట పెట్టుకున్నారు. తునిలో దరఖాస్తులు చేయడానికి వచ్చిన వారిపై నిఘా ఉంచి బెదిరిస్తున్నారు. అటు తన నియోజకవర్గ కేంద్రంలో వైన్ షాపులు కించుకున్నవారు షాపులో తనకు 25 శాతం వాటా ఇవ్వాలని ఓ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు హయాంలో కొనసాగిన ప్రభుత్వ మద్యం దుకాణాలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దుచేసింది. వీటిస్థానంలో గత పాత విధానమైన ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించి అందులో షాపులు దక్కించుకున్నవారే రెండేళ్లపాటు ఆయా వైనాపులను నడిపేలా ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా జిల్లాలో 155 ప్రైవేటు మద్యం దుకాణాలకు ఈనెల 1 నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలు పెట్టింది. ఎంతమంది ఎన్ని వైనావులకైనా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాలని పేర్కొంది. అయితే ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 155 దురాణాలకుగాను 610 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం సాయంత్రం అయిదు గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఒకపక్క దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ, ఆ తర్వాత లాటరీ దర్శించుకున్న వారికి పాపులు అప్పగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ మరోపక్క, ఈ వైన్‌షాపులకు దరఖాస్తు చేసినా లాటరీలో షాపు రావడం కష్టమనే ఉద్దేశంతో జిల్లాలో కొందరు వైసీపీ నేతలు అడ్డదారి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా లాటరీలో షాపులు దక్కించుకున్న వారు రద్దీ ప్రాంతాల్లో దుకాణం ఏర్పాటు చేయడానికి వీలేకుండా ఎక్కడికక్కడ సిండికేట్ అయిపోతూ అద్దెలు చెల్లించి ఆయా షాపులను వశం చేసేసుకుంటున్నారు.

తద్వారా లాటరీ దక్కించుకున్న వారు షాపు ఏర్పాటు చేయడానికి దుకాణాలు దొరకకుండా ముందే పన్నాగాలు పన్నుతున్నారు. దీంతో రద్దీ ప్రాంతాల్లో మద్యం దుకాణం ఏర్పాటుకు షాపులు దొరక్కపోతే, అటు రద్దీ లేని చోటకు వెళ్లలేక, ఇటు షాపులు దొరక్క చివరకు తమ వద్దకే వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. అలా లాటరీ వచ్చిన వారి మంచి ఆయా మద్యం దుకాణంలో ఎంతోకొంత వాటా లాగేయాలని చూస్తున్నారు. ప్రధానంగా కాకినాడ సిటీ నియోజరవర్గంలో 36. కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో 12 మద్యం దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. అయితే వీటిలో రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే అవకాశం ఉన్న మద్యం దుకాణాల భవనాలపై కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కన్నేశారు. తన అనుచరులతో స్కెచ్ వేసి 30 ఖాళీ దుకాణాలను ముందే అద్దె పేరుతో కొట్టేశారు. ఇవన్నీ 2019కి ముందు ప్రైవేటు వైన్ షాపులుగా ఉండేవి. ఇప్పుడు మళ్లీ వీటిలోనే షాపులు ఏర్పాటుచేస్తే మందుబాబులకు బాగా అలవాటైన దుకాణాలు కావడంతో వ్యాపారం బాగుంటుంది. ఈనేపథ్యంలో లాటరీ దర్శించుకున్న ఈ రద్దీ ప్రాంతాల్లోనే షాపులు తెరవాలి. అప్పుడే వ్యాపారం జరుగుతుంది. ఇది ముందే గమనించి వీటి యజమానులతో సంప్రదింపులు జరిపి ఆయన అనుచరులు అడ్వాన్స్‌లు ఇచ్చేశారు.


లాటరీ రాకపోయినా అలా కొట్టేద్దాం..

కాకినాడ సిటీలో భానుగుడి సెంటర్, నాగమల్లితోట, జగన్నాథపురం, డెయిరీఫారం సెంటర్, కల్పనా సెంటర్, గుడారిగుంట, దుమ్ములపేట, కరణంగారి జంక్షన్, వాకలపూడి, సర్పవరం ఇలా ఇవన్నీ అత్యంత రద్దీ ప్రాంతాలు. లాటరీ దక్కించుకున్న మద్యం దుకాణాదారులు ఎవరైనా ఈ సెంటర్లలోనే వైన్‌షాపులు తెరవాలి. అప్పుడే ఏడాదికి కట్టే రూ. 65 లక్షల మద్యం లైసెన్సు ఫీజురు గిట్టుబాటు అవుతుంది. కానీ ఇక్కడే ద్వారంపూడి చక్రం తిప్పారు. తన అనుచరుల్లో ఒకరైన ఓ బారు యజమాని, గత వైసీపీ ప్రభుత్వంలో ద్వారంపూడి మట్టి, గ్రావెల్ మాఫియాకు బినామీగా వ్యవహరించిన ఓ హోటల్ పేరుతో ఉన్న బినామీ కలిసి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో పలు పాత వైన్‌షాపుల వద్దకు వెళ్లి తమకు మద్యం దుకాణం లాటరీలో రాబోతోందంటూ ఒక్కో షాపునకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు గత నెలలో ఆడ్వాన్సులు ఇచ్చేసి ఆగ్రిమెంట్లు కూడా రాయించుకున్నారు. తద్వారా ఇవన్నీ తమ సిండికేట్‌లో ఉంచుకున్నారు. దీంతో ఈనెల 11న జరుగనున్న లాటరీలో షాపులు దక్కించుకున్న వారు దుకాణాల ఏర్పాటుకు ప్రయత్నించినా షాపులు దొరకని పరిస్థితి సృష్టించారు. దీంతో రద్దీలేని చోట పాపు తెరిస్తే వ్యాపారం పోతుంది. దీంతో ఎలాగైనా రద్దీ ప్రాంతాల్లో షాపుల కోసం తమ వద్దకు. వచ్చి తీరుతారని ప్లాన్ వేశారు. అప్పుడు షాపులో వాట చాగేసుకోవాలన్నది పన్నాగం.


అక్కడ దరఖాస్తు అంటే కష్టమే...

పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో దుకాణాలకు చాలా డిమాండ్. దీంతో వైసీపీకి చెందిన ఓ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కొన్ని నెలల ముందే పాత వైన్‌షాపు దుకాణాలను అద్దెకు తీసేసుకున్నారు. ఇప్పుడు లాటరీలో ఎవరికి షాపు వచ్చినా దుకాణం స్థలం కోసం ఈయన వద్దకు రావలసిందే. అప్పుడు అడిగిన వాటా ఇస్తే దుకాణం అద్దెకు ఇవ్వడం, లేదంటే వ్యాపారాన్ని దెబ్బతీయడానికి స్కెచ్ వేశారు. తునిలో కొందరు టీడీపీ, జనసేన, వైసీపీ నేతలు కలిసి మద్యం షాపులకు దరఖాస్తు చేయడానికి వచ్చే వారిపై ఎక్సైజ్ స్టేషన్ వద్ద నిఘా ఉంచి బెదిరిస్తున్నారు. షాపులు వస్తే తమ సిండి కేట్లో ఎవరో ఒకరికే రావాలని పంతం పట్టారు.

బయట వ్యక్తులు దరఖాస్తు చేయకుండా బెదిరిస్తున్నారు. రెండు రోజుల కిందట స్టేషన్లో ఓ అధికారి అయితే పెద్దోళ్లతో మాట్లాడి వచ్చాక దరఖాస్తు చేయాలంటూ తిప్పి పంపేశారు. ఇదిలా ఉంటే తన నియోజకవర్గ కేంద్రం హైవేను ఆనుకుని ఉండడంతో వ్యాపారం బాగా జరిగే అవకాశం ఉందని గ్రహించిన ఓ ఎమ్మెల్యే.. షాపుల కోసం దరఖాను వేసుకున్న వారికి ఓ షరతు నిపించారు. ఎవరికి పాపు వచ్చినా తనకు 25 శాతం వాటా ఇవ్వాలని హుకుం జారీచేశారు. వాటా పెట్టుబడి పెడతానని, కలిసి వ్యాపారం చేద్దామని ఆదేశించారు.


Also Read:

రాజస్థాన్ సీఎంకు చంద్రబాబు ఫోన్..

ఖాతా తెరవని 'ఆప్'.. కాంగ్రెస్ ఓట్లకు గండి

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకంజ

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 08 , 2024 | 01:36 PM