ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Government : వైసీపీ మాఫియాపై సిట్‌!

ABN, Publish Date - Dec 06 , 2024 | 02:55 AM

ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘వ్యవస్థీకృతం’గా జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి... బాధితులకు న్యాయం చేసి... దోషులను దండించేలా ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకాం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు జరిపిన అరాచకాలపై ఒక నివేదిక సిద్ధమైంది.

  • బాధితులకు న్యాయం చేయాలని సీఎం నిర్దేశం

  • రెండు నెలల కిందటే రంగంలోకి విజిలెన్స్‌

  • వైసీపీ కబ్జాలు, అక్రమాలపై ఆరా

  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిశీలన

  • విశాఖ నుంచి అనంత దాకా దారుణాలు

  • పోర్టులు, డిస్టిలరీలు, ప్రాజెక్టులు కబ్జా

  • రేషన్‌ బియ్యం రవాణాపైనా లోతుగా ఆరా

  • జిల్లా స్థాయి నేతల ఆగడాలకు అంతే లేదు

  • ప్రాథమిక ఆధారాలతో సమగ్రంగా నివేదిక

  • వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్‌!

  • ‘సిట్‌’తో గట్టిగా...

ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టం నుంచి సామాన్య ప్రజలకు జరిగిన కష్టాల వరకు అనేక కోణాల్లో విజిలెన్స్‌ సమగ్ర నివేదిక ఇచ్చింది. వీటిని అంశాల వారీగా వర్గీకరించి, దేనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించనున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై రేపో మాపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

‘‘గన్‌ చూపించి రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు రాయించుకోవడం, కొట్టేయడం దేశ చరిత్రలోనే లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంత దుర్మార్గంగా ఆస్తులు రాయించుకున్న ఘటన నేనైతే ఎప్పుడూ వినలేదు.. చూడలేదు. బాధితులకు న్యాయం జరగాల్సిందే. భూ సమస్యలపై రాష్ట్రంలో పెద్దఎత్తున వస్తున్న వినతులు, ఫిర్యాదుల్లో ప్రతి ఒక్క దానికీ సంపూర్ణ పరిష్కారం చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం’’... ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట! దీని అమలు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘వ్యవస్థీకృతం’గా జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి... బాధితులకు న్యాయం చేసి... దోషులను దండించేలా ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకాం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు జరిపిన అరాచకాలపై ఒక నివేదిక సిద్ధమైంది.


వైసీపీ ఐదేళ్ల అక్రమాలు, ఆక్రమణల గుట్టు రట్టు చేసేందుకు... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెండు నెలల కిందటే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రంగంలోకి దిగింది. విజిలెన్స్‌ సిబ్బంది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లి... ఇతర విభాగాల అధికారులతో కలిసి ఆయా అంశాలపై ఆరా తీశారు. రెండు నెలలపాటు శ్రమించి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై ‘సిట్‌’ను నియమించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఇదీ నేపథ్యం...: అధికారంలో ఉన్న వాళ్లు అవినీతికి పాల్పడటం షరా మామూలే! కానీ... ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగింది వేరు. అప్పటి ముఖ్యమంత్రి నుంచి గల్లీ నాయకుల దాకా అధికారం అండగా చెలరేగిపోయారు. అధికారం అండతో ‘మాఫియా’ తరహా డీల్స్‌ జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అనేక కంపెనీలు చేతులు మారిపోయాయి. రాష్ట్రస్థాయిలో గనులు, పోర్టులు, డిస్టిలరీలు, సెజ్‌లు, హోటళ్లు, రిసార్టులు... ఇలా ఒక్కటేమిటి! ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ అడుగు పెట్టి... అసలు వాటాదారులను, యజమానులను తరిమేశారు. వాటిని వైసీపీ పెద్దలు సొంతం చేసుకున్నారు. ఇక జిల్లాల స్థాయిలో ఎక్కడికక్కడ వైసీపీ నేతలు తమ అనుచరగణంతో చెలరేగిపోయారు. భూకబ్జాలు, దందాలకు పాల్పడ్డారు. అప్పట్లో ఐదు శాతం మంది బాధితులు కూడా దీనిపై నోరు తెరవలేకపోయారు. అక్కడక్కడా ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు. 95 శాతం మంది పూర్తి సైలెంట్‌గా ఉన్నారు. కొందరు భయంతో ఊళ్లూ, ప్రాజెక్టులు వదిలి వెళ్లిపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత బాధితులకు ధైర్యం వచ్చింది. టీడీపీ కార్యాలయానికి వందలూ, వేల సంఖ్యలో ఫిర్యాదుదారులు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చేశారు... చేస్తున్నారు. ఈ దారుణాలను ఉపేక్షిస్తే ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదని ప్రభుత్వం భావించింది. వీరందరికీ న్యాయం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగి... రెండు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించింది.


కళ్లు తిరిగే స్థాయిలో...: విశాఖలో ప్రైవేటు భూముల ఆక్రమణ నుంచి అనంతపురంలో ‘కియా’కు బెదిరింపుల దాకా... అనేక అంశాలను విజిలెన్స్‌ విభాగం తన నివేదికలో పొందుపరిచింది. రుషికొండకు గుండు కొట్టడం, గుడివాడలో క్యాసినోలు, కాకినాడలో ద్వారంపూడి బియ్యం దందా, గోదావరి జిల్లాలో ఆవ భూముల ఆక్రమణ, గుంటూరులో పిన్నెల్లి ఆగడాలు... ఇలా అనేక అక్రమాలను ఇతర విభాగాల అధికారులతో కలిసి నిగ్గు తేల్చారు. ఇక... రాష్ట్ర స్థాయి పెద్దల ఆదేశాల మేరకు జరిగిన డిస్టిలరీల ఆక్రమణ, వంతాడ లేటరైట్‌ గనుల కబ్జా, కాకినాడ పోర్టులో వాటాల బదిలీ, విశాఖలో విలువైన ప్రాజెక్టుల స్వాధీనం వంటి అంశాలనూ నివేదికలో సమగ్రంగా పొందుపరిచారు. గ్రామస్థాయి భూకబ్జాల నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగిన అరాచకాల దాకా అన్ని అంశాలనూ రెండు నెలలు శ్రమించి కూపీ లాగారు. ఈ దందాల తీరు, తీవ్రత చూసి ఉన్నతాధికారులు విస్తుపోయినట్లు తెలిసింది. కళ్లుతిరిగేలా సాగిన ఈ క్రైమ్‌పై సినిమా తీస్తే పది స్వీక్వెల్‌లూ సరిపోవని... సీరియల్‌ తీయాలంటే వందల ఎపిసోడ్లు కావాలని వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 02:55 AM