Employees: ఉద్యోగుల కోసం 78 వేల ఇళ్లు కట్టిస్తున్న ప్రముఖ టెక్ సంస్థ!
ABN, Publish Date - Apr 10 , 2024 | 06:07 PM
ప్రైవేటు సంస్థల్లో ఎప్పుడైనా ఉద్యోగులకు(employees) ఇళ్లు(houses) కట్టించి ఇవ్వడం చూశారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్(apple) ఇప్పుడు భారతదేశంలో ఇళ్లను నిర్మించబోతోంది. ఏకంగా 78,000 కంటే ఎక్కువ హౌసింగ్ యూనిట్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది.
ప్రైవేటు సంస్థల్లో ఎప్పుడైనా ఉద్యోగులకు(employees) ఇళ్లు(houses) కట్టించి ఇవ్వడం చూశారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్(apple) ఇప్పుడు భారతదేశంలో ఇళ్లను నిర్మించబోతోంది. ఏకంగా 78,000 కంటే ఎక్కువ హౌసింగ్ యూనిట్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. వీటిలో చాలా యూనిట్లు తమిళనాడులో నిర్మిస్తున్నారు. యాపిల్ గత రెండున్నరేళ్లలో భారతదేశంలో 150,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించింది. ఈ నేపథ్యంలో యాపిల్ ఎకోసిస్టమ్ చైనా, వియత్నాంలో పారిశ్రామిక గృహాల తరహాలో భారతదేశంలోని తన ఫ్యాక్టరీ ఉద్యోగులకు నివాస సౌకర్యాలను అందించడానికి సిద్ధమవుతోంది. Apple కాంట్రాక్ట్ తయారీదారులు, సరఫరాదారులు తమ ఉద్యోగుల కోసం గృహాలను నిర్మిస్తున్నారు.
ఐఫోన్లను తయారు చేస్తున్న అమెరికాకు(america) చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్(apple) భారత్‌లో 78,000కుపైగా ఇళ్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. మొత్తం 78,000 యూనిట్లకు పైగా నిర్మిస్తుండగా, వాటిలో 58,000 ఇళ్లు తమిళనాడు(tamilnadu)లో నిర్మిస్తున్నారు. తమిళనాడులోని చాలా ఇళ్లను తమిళనాడు స్టేట్ ఇండస్ట్రీ ప్రమోషన్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. టాటా గ్రూప్(tata group), ఎస్‌పీఆర్(SPR) ఇండియా కూడా ఇళ్లు నిర్మిస్తున్నాయి. ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం 10-15% నిధులను అందిస్తుంది. మిగిలిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు అందిస్తాయి. మార్చి 31, 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి కానుంది.
Apple 2017లో భారతదేశంలో iPhoneల తయారీని ప్రారంభించింది. ఆగస్ట్ 2021లో ప్రారంభమైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద ఉత్పత్తిని పెంచింది. కంపెనీ తన తాజా ఐఫోన్ మోడల్‌లను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ ద్వారా అసెంబ్లింగ్ చేస్తోంది. భారతదేశంలోనే భాగాలను కూడా తయారు చేస్తోంది. యాపిల్ చొరవతో ఈ హౌసింగ్ స్కీమ్ రూపొందుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల అశాంతి కారణంగా 2020లో కర్ణాటకలోని నరసపురాలోని విస్ట్రాన్ ఫెసిలిటీ, 2021 డిసెంబర్‌లో తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో పని దెబ్బతింది. దీంతో విస్ట్రాన్ యాజమాన్యం ఇప్పుడు టాటా గ్రూప్‌కి వచ్చింది. ఈ నేపథ్యంలో విస్ట్రోన్ తన ఫ్యాక్టరీకి సమీపంలో కార్మికులకు ఇళ్లను నిర్మిస్తోంది.
ఫ్యాక్టరీ సమీపంలోని కార్మికులకు నాణ్యమైన ఇళ్లను అందించడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది. దీని ద్వారా ఉత్పాదకత, పని పరిస్థితులను మెరుగుపరుస్తుందన్నారు. భారతదేశంలో ఆపిల్‌కు అతిపెద్ద ఐఫోన్‌ల సరఫరాదారు ఫాక్స్‌కాన్‌కు 35,000 ఇళ్లు లభిస్తాయి. కంపెనీ ఫ్యాక్టరీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఫాక్స్‌కాన్‌లో ప్రస్తుతం 41,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 75% మంది మహిళలు ఉన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య అమెరికా, చైనా మార్కెట్లలో మందగమనం ఉంది. ఈ కారణంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారతదేశంపై ఆపిల్ దృష్టి సారించింది.
ఇది కూడా చదవండి:
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత..
EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 10 , 2024 | 06:08 PM