ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market Open: కాసేపట్లో స్టాక్ మార్కెట్ ప్రారంభం.. ట్రేడింగ్ చేస్తున్నారా..

ABN, Publish Date - Sep 28 , 2024 | 10:36 AM

మాములుగా అయితే ప్రతి శని, ఆదివారాల్లో షేర్ మార్కెట్ బంద్ ఉంటుంది. కానీ నేడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE)లో స్పెషల్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నారు. అయితే ఆ ట్రేడింగ్ ఏ సమయంలో నిర్వహిస్తారు, ఎందుకనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

special trading session on NSE

సాధారణంగా అయితే స్టాక్ మార్కెట్‌కు(stock market) వారానికోసారి శని, ఆదివారాలు సెలవు ఉంటుంది. ఇవి కాకుండా పండుగ రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది. అయితే కొన్నిసార్లు మాత్రం సెలవు దినాల్లో కూడా మార్కెట్‌లో ప్రత్యేక ట్రేడింగ్ జరుగుతుంది. అదే విధంగా ఈరోజు కూడా స్టాక్ మార్కెట్‌లో అలాంటిదే జరగబోతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) అందుకు సంబంధించి నిన్న ఒక సర్క్యూలర్ జారీ చేసింది. ఈ సర్క్యూలర్ ప్రకారం మాక్ ట్రేడింగ్ సెషన్ కోసం శనివారం(సెప్టెంబర్ 28న) స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ ఒక గంట పాటు జరుగుతుందని వెల్లడించింది.


ట్రేడింగ్ సమయం

ఇక ట్రేడింగ్ సమయం సమయానికి విషయానికి వస్తే ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య ఎన్‌ఎస్‌ఈలో జరగనుంది. వాస్తవానికి టెస్టింగ్ ట్రేడింగ్ సెషన్ అత్యవసర సమయాల్లో NSE సేవలు సజావుగా కొనసాగేలా చూడటమే దీని లక్ష్యం. నేటి మాక్ స్పెషల్ ట్రేడింగ్ సెషన్ డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి కొనసాగుతుంది.

సర్క్యూలర్ ప్రకారం

ఎన్‌ఎస్‌ఈ సర్క్యూలర్ ప్రకారం సెప్టెంబర్ 28న క్యాపిటల్ మార్కెట్ విభాగంలో మాక్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. ఇది కాకుండా ఫ్యూచర్స్, ఆప్షన్స్ (F&O)లో కూడా ట్రేడింగ్ జరుగుతుంది. ఈ ట్రేడింగ్ సమయంలో డిజాస్టర్ రికవరీ సైట్‌కు స్విచ్ ఓవర్ ఉంటుంది. వాస్తవానికి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్టాక్ ఎక్స్ఛేంజ్ సేవలు ప్రభావితం కాకుండా స్విచ్ ఓవర్ చేయబడుతుంది.


స్టాక్ ఎక్స్ఛేంజ్

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ T+0 సెటిల్మెంట్ సిస్టమ్‌ను నిషేధించారు. ఈ నిషేధాన్ని సెప్టెంబర్ 30 నుంచి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం T+0 సెటిల్‌మెంట్ సిస్టమ్‌పై నిషేధం ఉందని NSE తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో స్టాక్ ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.


వారాంతంలో

ఈ వారం మొత్తం స్టాక్ మార్కెట్‌లో భారీ పెరుగుదల కనిపించింది. 2024 సెప్టెంబరు 27న కూడా స్టాక్ మార్కెట్ సూచీలు రెండూ గరిష్ట స్థాయిల్లో ప్రారంభమయ్యాయి. కానీ తర్వాత రెండూ రెడ్‌లో క్లోజ్ అయ్యాయి. చివరి సెషన్‌లో సెన్సెక్స్ 264.27 పాయింట్లు పతనమై 85,571.85 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ కూడా 40.90 పాయింట్లు పతనమై 26,175.15 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 541 పాయింట్లు కోల్పోయి 53834 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ కూడా 88 పాయింట్లు నష్టపోయి 60381 స్థాయిలో ముగిసింది. దీనికి ముందు రోజు స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి.


ఇవి కూడా చదవండి:

Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..


Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 28 , 2024 | 11:38 AM