ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. మరో 100 ఎయిర్‌బస్ విమానాలకు..

ABN, Publish Date - Dec 09 , 2024 | 05:42 PM

త్వరలో భారత్‌కు భారీ విమానాల సముదాయం రాబోతోంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాలను ఆర్డర్ చేసింది. దీంతో మిగతా విమానయాన సంస్థలు షాక్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Air India orders 100

ప్రముఖ భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (air india) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 100 ఎయిర్‌బస్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ చేసినట్లు ఎయిర్ ఇండియా ఈరోజు (డిసెంబర్ 9న) ధృవీకరించింది. దీనికి ముందు ఎయిర్ ఇండియా ఇప్పటికే 470 విమానాలను ఆర్డర్ చేసింది. దీంతో 570 విమానాలు త్వరలో భారత్‌కు చేరుకోనున్నాయి. అయితే ఎయిర్ ఇండియా చాలా తక్కువ సమయంలో చాలా విమానాలను కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలలో ఇది కూడా ఒకటని చెబుతున్నారు.


మార్కెట్‌లో సందడి

ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం నేపథ్యంలో ఏవియేషన్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎయిర్ ఇండియా ఇంత పెద్ద సంఖ్యలో విమానాలను ఎందుకు కొనుగోలు చేస్తోందని ఇతర విమానయాన సంస్థలు ఆలోచించడం ప్రారంభించాయి. ఎయిర్ ఇండియా నుంచి 500కు పైగా విమానాల ఆర్డర్ రావడంతో ఇతర ఏవియేషన్ కంపెనీలు కూడా ఈ దిశగా ప్లాన్ చేయడం ప్రారంభించాయి. ఎయిర్ ఇండియా ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన విమానయాన సంస్థగా ఉంది. దేశంలోని ప్రధాన ప్రాంతాలను విమానయాన సేవలను అందిస్తోంది.


ఏ విమానాలు ఆర్డర్ చేశారు..

ఎయిర్ ఇండియా 100 ఎయిర్‌బస్ విమానాలను ఆర్డర్ చేసినట్లు ప్రకటించింది. వీటిలో 10 వైడ్‌బాడీ A350, 90 నారోబాడీ A320 ఫ్యామిలీ, ఇతర A321neo విమానాలు ఉన్నాయి. అదే సమయంలో ఎయిర్ ఇండియా ఇప్పటికే 470 విమానాల కోసం ఆర్డర్ చేసింది. విమానాల తయారీ కంపెనీలైన ఎయిర్‌బస్‌, బోయింగ్‌లకు విమానాల కోసం ఈ ఆర్డర్లు ఇచ్చారు. టాటా గ్రూప్ (74.9%), సింగపూర్ ఎయిర్‌లైన్స్ (25.1%) అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా లిమిటెడ్‌కు ఎయిర్ ఇండియా యాజమాన్యం ఉంది. ఎయిర్ ఇండియా ఎయిర్ బస్, బోయింగ్ విమానాల సముదాయాన్ని నిర్వహిస్తోంది.


కారణమిదేనా..

ఎయిర్ ఇండియా 2023లో బోయింగ్‌తో 220 వైడ్‌బాడీ, నారోబాడీ విమానాల కోసం ఆర్డర్లు చేసింది. వాటిలో 185 విమానాలు డెలివరీ రావాల్సి ఉంది. రోల్స్ రాయిస్ ట్రెంట్ ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజన్‌లతో నడిచే ఎయిర్‌బస్ ఏ350ని నడుపుతున్న మొదటి భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కావడం విశేషం. అసాధారణమైన ఇంధన-సమర్థత, ప్రయాణీకుల సౌకర్యం, సుదూర శ్రేణి సామర్థ్యాలను అందజేస్తూ ఏ350లు ఇప్పుడు ఢిల్లీ నుంచి లండన్, న్యూయార్క్‌లకు నాన్‌స్టాప్‌గా ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి మూలకు అనుసంధానించే ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియాను నిర్మించాలనే మా మిషన్‌కు ఈ నిర్ణయం దోహదపడుతుందని చంద్రశేఖరన్ అన్నారు.


ఇవి కూడా చదవండి:

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Next Week IPOs: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వచ్చే వారం ఏకంగా 11 ఐపీఓలు..

Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 09 , 2024 | 06:08 PM