ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anand Mahindra: తయారీ రంగంలోని హీరోలకు సెల్యూట్.. మస్క్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా రిప్లై

ABN, Publish Date - Mar 31 , 2024 | 12:20 PM

తయారీ రంగంలోని వారి గురించి ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్యారేజీలో ఒంటరిగా కూర్చొనే ఆవిష్కర్తల గురించి సినిమాలు వచ్చాయి.. తయారీ రంగానికి చెందిన వారి గురించి సినిమా రాలేదని అభిప్రాయ పడ్డారు. ఆ ట్వీట్‌కు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. తయారీ రంగంలోని హీరోల గురించి సినిమాలు రావాల్సిందేనని అంగీకరించారు.

ఏబీఎన్ ఇంటర్నెట్: తయారీ రంగంలోని వారి గురించి ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్యారేజీలో ఒంటరిగా కూర్చొనే ఆవిష్కర్తల గురించి సినిమాలు వచ్చాయి.. తయారీ రంగానికి చెందిన వారి గురించి సినిమా రాలేదని అభిప్రాయ పడ్డారు. ఆ ట్వీట్‌కు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. తయారీ రంగంలోని హీరోల గురించి సినిమాలు రావాల్సిందేనని అంగీకరించారు. ఎలాన్ మస్క్ అభిప్రాయంతో ఏకీభవించారు. తన కెరీర్ తొలినాళ్లను ఆనంద్ మహీంద్రా గుర్తు చేసుకున్నారు.

ఇలా కెరీర్ స్టార్ట్

ఆటో ప్లాంట్‌లో ఉత్పత్తి విభాగంలో కెరీర్ ప్రారంభించానని ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం అక్కడ పని చేసే వారి నిరంతర కృషి, సమస్య పరిష్కారంలో చూపించే నైపుణ్యాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. వారి జీవిత కథలపై సినిమాలకు నిజంగా అర్హత కలిగి ఉన్నారు. మహీంద్ర కార్ల తయారీకి సంబంధించి తాము రూపొందించే షార్ట్ మూవీస్‌కు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోందని వివరించారు. యూట్యూబ్‌లో మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ రావాలని, దాంతోపాటు సినిమాలు కూడా తెరకెక్కించాలని ఆనంద్ మహీంద్రా అభిప్రాయ పడ్డారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Deadline: నేడే చివరి తేదీ...ఈ పనులు వెంటనే పూర్తి చేయండి

Updated Date - Mar 31 , 2024 | 12:23 PM

Advertising
Advertising