Share News

Viral Video: అనంత్ అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సింగర్ల ప్రదర్శన

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:49 PM

ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(anant ambani), రాధిక మర్చంట్(radhika merchant) వివాహ తేదీని ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే అనంత్, రాధిక రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.

Viral Video: అనంత్ అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సింగర్ల ప్రదర్శన
anant ambani radhika merchant second Pre Wedding

ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(anant ambani), రాధిక మర్చంట్(radhika merchant) వివాహ తేదీని ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే అనంత్, రాధిక రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. జామ్‌నగర్‌లో మూడు రోజుల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ తర్వాత, అంబానీ ఫ్యామిలీ ఇటలీ(Italy)లోని క్రూయిజ్‌లో రెండవ ప్రీ వెడ్డింగ్ పార్టీని నిర్వహించారు.

ఈ పార్టీ వేడుకలు మే 30 నుంచి జూన్ 01 వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పార్టీకి కూడా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ సహా పలువురు పాప్ సింగర్లు ఆండ్రియా బోసెల్లి, ర్యాపర్ పిట్‌బుల్‌ల ప్రదర్శన ఇచ్చారు. అయితే అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి మరి.


జూలై 12న రాధికా-అనంత్‌ల వివాహం(Anant Ambani-Radhika wedding) జరగనుంది. వేడుక చివరి రోజు రాత్రి హాలీవుడ్ సింగర్లు కేటీ పెర్రీ, పిట్‌బుల్ పాటలను పాడారు. అందరూ వారి పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వేడుకలో సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా పాల్గొననున్నారు. అయితే ప్రస్తుతం క్రూయిజ్‌లో జరిగిన వేడుకల చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సారా అలీ ఖాన్ అంబానీ బాష్ కోసం ఇటలీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో సహా స్టార్ స్టడెడ్ ఈవెంట్ నుంచి కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.


ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో రణవీర్ సింగ్, అనన్య పాండే, సారా అలీ ఖాన్(sara ali khan) సహా పలువురు ఉన్నారు. కానీ వారి ఫోటోలు, వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. గతంలో జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ పార్టీ చిత్రాలు మాత్రం సోషల్‌ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అయితే అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని అంబానీ ఫ్యామిలీకి చెందిన ఫ్యాన్ పేజీ తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేయడం లేదని అంటున్నారు.


ఇది కూడా చదవండి:

గత నెల జీఎస్‌టీ ఆదాయం రూ.1.73 లక్షల కోట్లు


CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


Read Latest Business News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 12:49 PM