Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..
ABN, Publish Date - Aug 21 , 2024 | 01:07 PM
వీకెండ్ సెలవులకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వెళ్లేందుకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అనంతగిరి హిల్స్(ananthagiri hills). పచ్చటి చెట్లతోపాటు పురాతన గుహలు, దేవాలయాలు కూడా ఇక్కడ ఉండటం విశేషం. సహజమైన సౌందర్య సంపదను కలిగి ఉన్న ఈ ప్రాంతానికి ప్రస్తుతం సీజన్‌లో ఎప్పుడైనా వెళ్లవచ్చు.
ప్రస్తుత సమయంలో వీకెండ్ సెలవులకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వెళ్లేందుకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అనంతగిరి హిల్స్(ananthagiri hills). పచ్చటి చెట్లతోపాటు పురాతన గుహలు, దేవాలయాలు, సేలయేళ్లు కూడా ఇక్కడ ఉండటం విశేషం. సహజమైన సౌందర్య సంపదను కలిగి ఉన్న ఈ ప్రాంతానికి ప్రస్తుత సీజన్‌లో ఎప్పుడైనా వెళ్లవచ్చు. ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల ద్వారా వెళ్లవచ్చు. లేదంటే నలుగురు లేదా ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటే కారులో షికారు చేస్తూ ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. దీంతోపాటు ట్రైన్స్ ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఖర్చు కూడా తక్కువగానే అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన ప్రాంతాలు ఏం ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బొర్రా గుహలు
అనంతగిరి హిల్స్‌లో చూసేందుకు ఉన్న వాటిలో ప్రముఖమైనది 'బొర్రా గుహలు'. అరకు లోయలోని కొండల్లో ఉన్న ఈ గుహలు అద్భుతమైన నిర్మాణాలలో ఒకటిగా ఉన్నాయి. వీటిని దేశంలోని అతిపెద్ద గుహ అని కూడా పిలుస్తారు. ఈ గుహ దాదాపు 80 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. దీనిని చూసేందుకు తరచుగా భారతదేశంతోపాటు విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
పద్మాపురం గార్డెన్
బొర్రా గుహలను సందర్శించిన తరువాత మీరు పద్మాపురం గార్డెన్‌కి వెళ్లవచ్చు. అరకు ఘాటిలో ఉన్న ఈ తోట చాలా అందమైన దృశ్యాన్ని కల్గి ఉంటుంది. ఈ ఉద్యానవనాన్ని చారిత్రక తోట అని కూడా పిలుస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు కూరగాయలు అందించడానికి ఈ తోటను సాగు చేశారని చెబుతుంటారు. కానీ నేడు ఇది ఉద్యానవనంగా మారిపోయింది. ఇక్కడ వేలాది రకాల పువ్వులు, మొక్కలను పెంచుతున్నారు.
కాఫీ తోటలు
పద్మాపురం గార్డెన్‌ను సందర్శించిన తర్వాత అనంతగిరి హిల్స్‌లోని కాఫీ తోటల ప్రదేశానికి వెళ్లవచ్చు. ఈ ప్రదేశం హైదరాబాదు చుట్టుపక్కల వారికే కాదు, ఈ కాఫీ తోట తెలంగాణ అంతటా బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడికి ఎల్లప్పుడూ పర్యాటకులు పిక్నిక్‌లు చేస్తూ ఉంటారు.
మూసి నది
అనంతగిరి కొండలలో పుట్టిన మూసి నదిని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది వికారాబాద్ సమీపంలో ఉన్న కృష్ణా నదికి ఉపనదిగా ఉంది. దీని ముచుకుంద అని కూడా పిలుస్తారు. ఇది రాష్ట్రంలోని దక్కన్ ప్రాంతం గుండా ప్రవహిస్తూ వజీరాబాద్ సమీపంలో నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తుంది.
కొండల్లో ట్రెక్కింగ్
ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ సౌకర్యం కూడా ఉంది. నిశ్శబ్ద సమయంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ విహరించవచ్చు. కాలిబాట సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. ఎప్పుడైనా సందర్శించడానికి అనుగుణంగా ఉంటుంది.
గిరిజన మ్యూజియం
అనంతగిరిని సందర్శించినప్పుడు మీరు ఇక్క ఉన్న గిరిజన మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చు. ఈ ప్రాంతంలో మీరు గిరిజన వర్గాల జీవనశైలి, సంస్కృతులను చూడవచ్చు. ఇక్కడ మీరు నగలు, వేట సాధనాలు, వంటగది పాత్రలు వంటి గిరిజన సమాజానికి సంబంధించిన అనేక కళాఖండాలను గమనించవ్చచు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..
Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 21 , 2024 | 01:08 PM