CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
ABN, Publish Date - May 25 , 2024 | 02:55 PM
సిబిల్ స్కోర్(CIBIL Score) ప్రస్తుతం మీరు బ్యాంక్ దృష్టిలో విలువైన వినియోగదారునా కాదా అని నిర్ణయిస్తుంది. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకు లేదా ఫైనాన్షియల్ సంస్థలు మీకు రుణాన్ని అందిస్తాయి. అయితే ప్రతి నెల క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే ఏమవుతుందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
సిబిల్ స్కోర్(CIBIL Score) ప్రస్తుతం మీరు బ్యాంక్ దృష్టిలో విలువైన వినియోగదారునా కాదా అని నిర్ణయిస్తుంది. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకు లేదా ఫైనాన్షియల్ సంస్థలు మీకు రుణాన్ని అందిస్తాయి. సాధారణంగా మీరు లోన్ కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు, బ్యాంకు రుణం ఇచ్చే ముందు మీ CIBIL స్కోర్‌ను తనిఖీ చేస్తుంది. అయితే మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి వెంటనే రుణం లభిస్తుంది. ఈ స్కోర్ 300 నుంచి 900 మధ్య సెట్ చేయబడింది. మీ సిబిల్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది మంచిదని పరిగణించబడుతుంది. అంతకంటే తక్కువగా ఉంటే రుణం పొందడం కష్టమవుతుంది.
సిబిల్ స్కోర్ అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మీరు తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తున్నట్లయితే మీ CIBIL స్కోర్ బాగుంటుంది. అదే సమయంలో మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించకపోతే మీ CIBIL స్కోర్ తగ్గడం ప్రారంభమవుతుంది. మరోవైపు మీరు CIBIL స్కోర్‌ను మళ్లీ మళ్లీ తనిఖీ చేసినప్పటికీ, మీ స్కోర్ తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు గత మూడు నెలల్లో 13 సార్లు లేదా అంతకంటే ఎక్కువగా సిబిల్ స్కోర్ చెక్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
సాధారణంగా వ్యక్తిగత రుణం లేదా మరేదైనా రుణం కోసం వినియోగదారులు అనేక బ్యాంకులను ఏకకాలంలో సంప్రదిస్తారు. ఆ విధంగా పలు మార్లు సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేయడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ క్షీణిస్తుంది. కానీ బ్యాంకులు మీ CIBIL స్కోర్‌ని తనిఖీ చేసినప్పుడు, అది హార్డ్ CIBIL స్కోర్. వినియోగదారులు యాప్ సహాయంతో స్కోర్‌ని చెక్ చేస్తే అది సాఫ్ట్ స్కోర్ చెకింగ్ అవుతుంది. ఆ క్రమంలో తక్కువ స్కోరు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం అనేక మంది వినియోగదారులు పలు యాప్స్ సహాయంతో మాన్యువల్‌గా సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారు. ఇది వారికి రెండు రకాల నష్టాలను కలిగిస్తుంది. మొదటిది CIBIL స్కోర్ తగ్గడం, రెండవది వివిధ యాప్‌ల నుంచి తనిఖీ చేసినప్పుడు మీ వ్యక్తిగత డేటా ఆ యాప్‌లన్నింటికీ అందుబాటులో ఉంటుంది. దీంతో సైబర్ దాడి జరిగే అవకాశాలు ఎక్కువ, దీంతోపాటు ఆయా యాప్స్ నుంచి మీకు కాల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెలలో ఎక్కువసార్లు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయోద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.
Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్
Read Latest Business News and Telugu News
Updated Date - May 25 , 2024 | 02:56 PM