Share News

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:37 PM

సెప్టెంబర్ నెల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. మరోవైపు అక్టోబరు నెలలో చాలా పండుగలు రాబోబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
bank holidays in October 2024

సెప్టెంబర్ నెల ముగిసేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత అక్టోబర్ నెల మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో అనేక పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు(bank holidays) ఉన్నాయి. దీంతో అక్టోబర్ నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ క్రమంలో మీకు అక్టోబరు నెలలో ఏదైనా బ్యాంక్ సంబంధిత పని ఉంటే, ముందుగా సెలవుల జాబితాను చెక్ చేసుకుని ఆయా పనుల కోసం వెళ్లండి. లేదంటే మీరు హాలిడే రోజు బ్యాంకుకు వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.


అక్టోబర్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా

  • అక్టోబర్ 2, 2024: గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

  • అక్టోబర్ 3, 2024: నవరాత్రి ప్రారంభం, మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా హర్యానా, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు

  • అక్టోబర్ 6, 2024: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే

  • అక్టోబర్ 10, 2024: మహా సప్తమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

  • అక్టోబర్ 11, 2024: మహానవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు


  • అక్టోబర్ 12, 2024: ఆయుధ పూజ, దసరా, రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

  • అక్టోబర్ 13, 2024: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే

  • అక్టోబర్ 17, 2024: కటి బిహు సందర్భంగా అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి

  • అక్టోబర్ 20, 2024: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

  • అక్టోబర్ 26, 2024: నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి


  • అక్టోబర్ 27, 2024: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే

  • అక్టోబర్ 31, 2024: దీపావళి కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

అక్టోబరు నెలలో గాంధీ జయంతి కారణంగా అక్టోబర్ 2న బ్యాంకులు పనిచేయవు. దీంతోపాటు దుర్గాపూజ, దసరా, దీపావళి, ధన్‌తేరస్‌, సర్దార్‌ పటేల్‌ పుట్టినరోజు సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. RBI ప్రకారం బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారుతుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రాంతీయ సెలవుల కారణంగా కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.


ఇవి కూడా చదవండి:

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 21 , 2024 | 12:38 PM