ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ లాసింగ్ స్టాక్స్

ABN, Publish Date - Oct 30 , 2024 | 10:44 AM

భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో దూసుకెళ్తున్నాయి. ప్రధాన సూచీలైన BSE సెన్సెక్స్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ సూచీలు దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా నష్టపోయిన, లాభపడ్డ స్టాక్స్ వివరాలను ఇక్కడ చుద్దాం.

Stock Market today updates

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) బుధవారం (అక్టోబర్ 30, 2024) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. దీపావళి పండుగకు ముందే బెంచ్‌మార్క్ ప్రధాన సూచీలైన BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 క్షీణించాయి. ఉదయం 10.35 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 259 పాయింట్లు క్షీణించి 80,109.44 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 70.65 పాయింట్లు తగ్గిపోయి 24,396.20 వద్ద ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 503 పాయింట్లు పడిపోయి 51,820 పరిధిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం వీటికి విరుద్ధంగా లాభాల బాటలో పయనిస్తుంది. ఇది 335 పాయింట్లు పెరిగి, 56,586 స్థాయిలో ఉంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.


టాప్ 5 స్టాక్స్

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ధోరణులు సహా పలు అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. BSE సెన్సెక్స్ ఇండెక్స్‌లోని 30 స్టాక్స్‌లో, 20 స్టాక్‌లు రెడ్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లో 33 షేర్లు నష్టాల్లో ఉండగా, 17 లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సిప్లా (4 శాతం క్షీణత), శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ICICI బ్యాంక్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, అదానీ ఎంటర్‌ప్రైస్, భారత్ ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్, TATA కంన్య్జూమర్స్, విప్రో సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి.


ఇతర సూచీలు

మరోవైపు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉన్నాయి. దక్షిణ కొరియా కోస్పి, ఆస్ట్రేలియా ASX 200 రెడ్‌లోనే ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 225 వాల్ స్ట్రీట్‌లో రాత్రిపూట లాభాలను నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన 2 రోజుల పాలసీ సమావేశాన్ని బుధవారం ప్రారంభించింది. ఆర్థికవేత్తలు సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.25 శాతం వద్ద స్థిరంగా ఉంచాలని భావిస్తున్నారు. దక్షిణ కొరియా కోస్పి 0.52 శాతం పతనమవగా, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ స్వల్పంగా ట్రేడవుతోంది. ఈ వారం కీలక ఆదాయ నివేదికల కంటే ముందుగా నాస్‌డాక్ రికార్డు ముగింపును నమోదు చేసింది. US అధ్యక్ష ఎన్నికలకు వారం దూరంలో ట్రెజరీ ఈల్డ్‌లు గరిష్టాలను తాకాయి.


నిన్న ఎలా ఉన్నాయంటే..

సెక్టార్ల వారీగా చూస్తే హెల్త్‌కేర్ (1.69 శాతం క్షీణత), ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ నిఫ్టీ సూచీలు ఆ తర్వాత నిలిచాయి. కానీ ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతుండటం విశేషం. ఇక మంగళవారం బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్ 363.99 పాయింట్లు పెరిగి 80,369.03 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 127.70 పాయింట్లు పెరిగి 24,466.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 50లోని 50 షేర్లలో 31 లాభాల్లో ముగియగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 14 గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 0.92, 0.76 శాతం లాభంతో ముగిశాయి.


ఇవి కూడా చదవండి:

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 30 , 2024 | 10:54 AM