ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget 2024: బడ్జెట్ 2024లో ఈ స్కీంల పరిస్థితి ఏంటి.. ఈసారైనా పెంచుతారా?

ABN, Publish Date - Jul 08 , 2024 | 12:07 PM

కేంద్ర బడ్జెట్ 2024-25ను (budget 2024) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) జులై 23న సమర్పించనున్నారు. అయితే ఈ బడ్జెట్‌పై సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సహా వ్యాపారులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఉజ్వల్, పోస్టాఫీసు స్కీంలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయబోతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

budget 2024 expectations

కేంద్ర బడ్జెట్ 2024-25ను (budget 2024) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) జులై 23న సమర్పించనున్నారు. అయితే ఈ బడ్జెట్‌పై సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సహా వ్యాపారులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రధానంగా పన్ను మినహాయింపులో రిలీఫ్ ఇవ్వడం సహా పలు అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో గ్రామస్తులకు ఏం ప్రకటిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉజ్వల్, పోస్టాఫీసు స్కీంలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయబోతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


సబ్సిడీ

అయితే వచ్చే బడ్జెట్ 2024లో కేంద్రం రూ. 9,000 కోట్ల ఎల్‌పీజీ(LPG) సబ్సిడీని కేటాయించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ప్రయోజనంగా ఉండనుంది. అంతేకాదు 2026 ఆర్థిక సంవత్సరం వరకు ఉచిత LPG కనెక్షన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని కొనసాగించవచ్చని అంటున్నారు. మరోవైపు ఈ స్కీం ద్వారా మరో 70 వేలకు పైగా కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం రూ.11,925.01 కోట్ల ఎల్‌పీజీ సబ్సిడీని ప్రకటించారు.


ఎంత సబ్సిడీ ఇస్తారు?

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీం(ujjwala yojana) మే 2016లో ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా పేద కుటుంబాలు చౌకైన గ్యాస్ సిలిండర్ల ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలకు ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని అందజేస్తారు. మే 2022లో ప్రభుత్వం PMUY లబ్ధిదారులకు సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీని ఇచ్చింది. దీనిని అక్టోబర్ 2023లో రూ. 300కి పెంచుతున్నట్లు ప్రకటించింది.


ఇతర ప్రయోజనాలుంటాయా?

సామాన్యులకు ఉపశమనం కల్పిస్తూనే కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు కింద చిన్న పొదుపు పథకాల(post office schemes) విషయంలో ఓ ప్రకటన చేయవచ్చని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. ఈ పథకాల వడ్డీ, పన్ను మినహాయింపు పరిమితి, పెట్టుబడి పరిమితిని ప్రభుత్వం పెంచవచ్చని భావిస్తున్నారు. గత పూర్తి బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పరిమితిని ప్రభుత్వం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఈసారి కూడా పెంచవచ్చని భావిస్తున్నారు.

80C కింద పన్ను మినహాయింపు

ఇది కాకుండా ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద సాధారణ ప్రజలకు పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచవచ్చని కూడా చెబుతున్నారు.


ఇది కూడా చదవండి:

Viral Video: రాధిక మర్చంట్ సోదరిని చుశారా.. చీరలో మాములుగా లేదుగా..


Rains: 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. మరో 11 రాష్ట్రాలకు అలర్ట్

NEET UG 2024: నీట్ యూజీ పేపర్ లీక్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. పరీక్షలో అవకతవకలు సహా 38 పిటిషన్లు

For Latest News and Business News click here

Updated Date - Jul 08 , 2024 | 12:11 PM

Advertising
Advertising
<