ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget 2024: బడ్జెట్‌పై బోలెడు ఆశలు.. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేనా!?

ABN, Publish Date - Jul 13 , 2024 | 05:20 PM

Budget 2024: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్‌ను జూలై 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో.. ఈసారి బడ్జెట్‌పై యావత్ దేశం ఉత్కంఠగా చూస్తోంది.

Budget 2024

Budget 2024: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్‌ను జూలై 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో.. ఈసారి బడ్జెట్‌పై యావత్ దేశం ఉత్కంఠగా చూస్తోంది. అయితే, ప్రధానంగా ఈసారి బడ్జెట్‌లో ఆరోగ్య రంగంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రజలు. మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం చేసిన సూచనలే ఇందుకు కారణం. ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచగా, ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య బీమా పథకం ద్వారా పేదలే కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు ప్రయోజనం పొందాలనేది అతిపెద్ద డిమాండ్లలో ఒకటి.


ఇక మధ్యంతర బడ్జెట్ విషయానికి వస్తే.. ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ. 90,171 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్ కేటాయింపు రూ.79,221 కోట్ల కంటే ఎక్కువ. అయినప్పటికీ, మనదేశం జిడిపిలో కేవలం 2 శాతం మాత్రమే ఆరోగ్య రంగానికి ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. నిపుణులు ఇప్పుడు దీనిని 3 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సాధారణ ప్రజలు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా సద్వినియోగం చేసుకోవాలి..

దేశంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా ప్రయోజనం పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను విస్తరింపజేస్తే ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా సదుపాయం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. పథకాన్ని విస్తరించడం ద్వారా మధ్యతరగతి ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని.. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచిస్తున్నారు.


‘ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లేదా సమగ్ర ఆరోగ్య బీమా కవర్ వంటి పథకాలను విస్తరించడం వలన ప్రతి పౌరుడికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుతుంది. రానున్న బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణకు జీడీపీలో 2.5 శాతం నుంచి 3.5 శాతం కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవాలి. దీని వలన దేశంలో సార్వత్రిక ఆరోగ్య బీమా కవరేజీ దిశగా అడుగులు వేయగలుగుతాం’ అని ఆరోగ్య నిపుణులు అచెబుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. కనీస సార్వత్రిక ఆరోగ్య బీమా దిశగా ప్రభుత్వం వెళ్లాలని సూచించారు.


ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రభుత్వం దృష్టి సారించాలి..

దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల పరిస్థితిని మెరుగుపరచడానికి, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని 140 కోట్ల జనాభాకు ప్రస్తుతం 70,000 ఆసుపత్రులు ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇటీవలి నివేదికలో పేర్కొంది. ఇందులో 63 శాతం ప్రైవేటు రంగంలో ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను కలిపితే 1000 మందికి 1.3 హాస్పిటల్ బెడ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి 1000 మందికి 3 పడకలకు తీసుకోవడం ప్రామాణికం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, భారతదేశం ఇంకా 24 లక్షల పడకల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.


ఇదిలాఉంటే.. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకానికి కేటాయింపులను కూడా పెంచింది. ఇందుకోసం దాదాపు రూ.7200 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్-హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం ప్రత్యేకంగా రూ.646 కోట్లు కేటాయించారు.

Also Read:

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ ఔట్..?

మరో ఐదు రోజులు అతలాకుతలమే..!

పోలీస్ స్టేషన్‌‌పైకి ఎక్కిన ఎద్దు.. షాకింగ్ దృశ్యాలు!

For More Business News and Telugu News..

Updated Date - Jul 13 , 2024 | 05:20 PM

Advertising
Advertising
<