ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Credit Cards: క్రెడిట్ కార్డ్ యూజర్స్‌కి బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..!

ABN, Publish Date - Jul 01 , 2024 | 12:00 PM

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ చాలా మందికి జీవితంలో కీలకంగా మారింది. షాపింగ్, ఇతర లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగిస్తారు. అయితే, జులై 1వ తేదీ నుంచి క్రెడిక్ కార్డ్స్ వినియోగ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలలో మార్పులు అమల్లోకి వచ్చాయి.

Credit Card Rules

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ చాలా మందికి జీవితంలో కీలకంగా మారింది. షాపింగ్, ఇతర లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగిస్తారు. అయితే, జులై 1వ తేదీ నుంచి క్రెడిక్ కార్డ్స్ వినియోగ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలలో మార్పులు అమల్లోకి వచ్చాయి. రివార్డ్ పాయింట్స్ మొదలు.. కార్డ్ సంబంధిత ఛార్జీల వరకు అన్ని మార్పులు ఉన్నాయి. మరి ఆ కొత్త నిబంధనలు ఏంటో ఓసారి తెలుసుకుందాం..


SBI క్రెడిట్ కార్డ్ నిబంధనలలో మార్పులు..

జులై 1, 2024 నుండి ఎలాంటి ప్రభుత్వ లావాదేవీలపైనా కస్టమర్‌లు రివార్డ్ పాయింట్‌లను పొందబోరని ఎస్‌బిఐ ప్రకటించింది. అయితే కొన్ని SBI కార్డ్‌లలో ఈ సదుపాయం జూలై 15, 2024 వరకు ఉంటుందని.. ఆ తరువాత నిలిపివేయడం జరుగుతుందని ఎస్‌బిఐ ప్రకటించింది.

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు..

ఐసిఐసిఐ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన కొత్త నిబంధనలను జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చాయి. ఐసీఐసీఐ కార్డు హోల్డర్లు కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జ్ పెంచింది. ఇప్పటికే రూ.100 చెల్లించాల్సి ఉండగా.. ఇక నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. చెక్కు, నగదు విత్‌డ్రాపై రూ.100 చార్జీలు నిలిచిపోనున్నాయి. అదే సమయంలో.. ఛార్జ్ స్లిప్ అభ్యర్థనపై రూ.100 ఛార్జీ కూడా నిలిపివేయబడింది. చెక్కు విలువ రూ.100పై 1% ఛార్జీని నిలిపివేయాలని కూడా నిర్ణయించారు. దీనితో పాటు, డూప్లికేట్ స్టేట్‌మెంట్ అభ్యర్థనపై విధించే రూ.100 రుసుము కూడా నిలిపివేశారు.


సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్..

జూలై 15, 2024 నాటికి అన్ని మైగ్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయాలని సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లను కోరింది. బ్యాంక్ తన ఖాతాదారులకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలు..

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను కూడా మార్చింది. ఈ రూల్ ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. HDFC బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు ఇప్పుడు CRED, Paytm, Cheq, MobiKwik, Freecharge వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తే అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

For More Business News and Telugu News..

Updated Date - Jul 01 , 2024 | 12:00 PM

Advertising
Advertising