ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NPPA: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. కీలక మందుల ధరలు తగ్గింపు

ABN, Publish Date - May 16 , 2024 | 04:45 PM

లోక్‌సభ 2024 ఎన్నికలకు(lok sabha elections 2024) ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో గుండె, కాలేయం, మధుమేహం సహా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలను(medicines rates) తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

medicines rates decrease

లోక్‌సభ 2024 ఎన్నికలకు(lok sabha elections 2024) ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో గుండె, కాలేయం, మధుమేహం సహా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలను(medicines rates) తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో పెయిన్, హార్ట్, లివర్, ఇన్ఫెక్షన్, ఎలర్జీ, మల్టీవిటమిన్, యాంటాసిడ్, యాంటీ బయాటిక్స్ సహా 41 మందులు, 6 ఫార్ములేషన్‌ల రేట్లను ప్రభుత్వం నిర్ణయించింది.


నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా(NPPA) 143వ సమావేశంలో మందుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే ఈ సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఔషదం ధరకు అదనంగా జీఎస్‌టీని మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలలో స్పష్టం చేశారు.


దేశంలోని చాలా మంది ప్రజలు అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, షుగర్, పెయిన్ కిల్లర్స్, గుండె, కాలేయం, మల్టీవిటమిన్స్, యాంటీ బయాటిక్స్ మొదలైన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు చాలా ఖరీదైనవి. ఈ క్రమంలోనే మందుల ధరలను నియంత్రించేందుకు ఎన్‌పీపీఏ సమావేశంలో 41 ఔషధాల ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల సాధారణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధికి సంబంధించిన మందుల ధరలను తగ్గించడం ద్వారా అందుకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఉపశమనం లభించనుంది. ఫిబ్రవరి 2024లో కూడా మధుమేహం, రక్తపోటు రెండింటి చికిత్సలో ఉపయోగించే 69 ఔషధాల ధరలను NPPA తగ్గించింది.


ఇది కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

SEBI: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు శుభవార్త.. ఆ రూల్స్ సడలించిన సెబీ


Read Latest Business News and Telugu News

Updated Date - May 16 , 2024 | 04:51 PM

Advertising
Advertising