ITR Filing: గుడ్ న్యూస్.. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచారోచ్..
ABN, Publish Date - Dec 31 , 2024 | 01:19 PM
ఆలస్యంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసే వారికి శుభవార్త. ఎందుకంటే తాజాగా ఈ గడువు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎప్పటివరకు పొడిగింపు చేశారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏందుకంటే ఆలస్యంగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు (ITR Filing) చేయడానికి ప్రభుత్వం మళ్లీ గడువును పొడించించింది. ఈ గడువు డిసెంబర్ 31, 2024 వరకు ఉండగా, దీనిని తాజాగా జనవరి 15, 2025 వరకు పొడిగించారు. ఈ క్రమంలో పన్ను చెల్లింపు దారులు జనవరి 15, 2025 వరకు ఆలస్య రుసుముతో ITRని ఫైల్ చేసుకోవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేయడానికి మొదట చివరి తేదీ ఆలస్యం రుసం లేకుండా జూలై 31, 2024గా ఉండేది.
దాఖలు చేయడానికి..
దీంతో ఆలస్య రుసుముతో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి మీరు ITR 2023-24ని ఫైల్ చేయకుంటే, జనవరి 15 వరకు ఫైల్ చేయవచ్చు. మీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే, మీరు రూ. 1,000 ఆలస్య రుసుము చెల్లించాలి. మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆలస్య రుసుము రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను రిటర్న్ ఎలా దాఖలు చేయాలంటే..
ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వైబ్ సైట్‌కి వెళ్లండి
మీ పాన్ కార్డ్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి
మీ ఆదాయానికి అనుగుణంగా ఉన్న ITR ఫారమ్‌ను ఎంచుకోండి
అసెస్‌మెంట్ ఇయర్ – FY24 కోసం AY2024-25ని ఎంచుకోండి
అవసరమైన వ్యక్తిగత వివరాలు, తగ్గింపు వివరాలను పూరించండి
దాఖలు చేయడానికి ఆలస్య రుసుము రూ. 5,000 వర్తిస్తుంది
ఆధార్ OTPని ఉపయోగించి సమర్పించండి, ఆ తర్వాత ధృవీకరించండి
ఆఫ్ లైన్ విధానంలో కూడా..
మీరు ఆదాయపు పన్ను కార్యాలయానికి వెళ్లి కూడా ఆఫ్ లైన్ విధానంలో ఫారమ్‌ను సమర్పించడం ద్వారా ధృవీకరణ ఎంపికను ఎంచుకోవచ్చు. జనవరి 15లోగా రిటర్నులు దాఖలు చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?. ఆలస్యమైన ITRని ఫైల్ చేయడం ద్వారా మీరు నోటీసును నివారించకోవచ్చు. కానీ గడువు తేదీలోగా అంటే జూలై 31 నాటికి రిటర్న్‌ను ఫైల్ చేయకపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మీరు గడువు తేదీకి ముందు ITR ఫైల్ చేస్తే, మీరు మీ నష్టాన్ని భవిష్యత్ ఆర్థిక సంవత్సరాలకు ఫార్వర్డ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఫైల్ చేస్తే
అంటే మీరు వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో మీ ఆదాయాలపై పన్ను బాధ్యతను తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ITR ఫైల్ చేసిన తర్వాత దీని ప్రయోజనాన్ని పొందలేరు. ఇది కాకుండా మీ ఆదాయం మరింత సమాచారం కావాలంటే మీరు ఆదాయపు పన్ను శాఖ నుంచి తెలుసుకోవచ్చు. ITR ఫైల్ చేయకపోతే ఆ సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపించే ఛాన్స్ ఉంది. నోటీసు ఇబ్బందులను నివారించడానికి ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి.
ఇవి కూడా చదవండి:
Year End Sunrise: 2024 చివరి సూర్యోదయం ఎందుకంత స్పెషల్
Stock Market: 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Major Changes: 2025లో బిగ్ ఛేంజేస్.. తెలుసుకోకుంటే మీకే నష్టం..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 31 , 2024 | 01:22 PM