Share News

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

ABN , Publish Date - May 23 , 2024 | 02:51 PM

మే నెల మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. దీంతో కొత్త సంవత్సరంలో ఆరవ నెలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. దీంతోపాటు ఎన్నిరోజులు బ్యాంకులు పనిచేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.
June 2024 bank holidays

మే నెల మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. దీంతో కొత్త సంవత్సరంలో ఆరవ నెలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. దీంతోపాటు ఎన్నిరోజులు బ్యాంకులు పనిచేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే అనేక మంది ఆర్థిక లావాదేవీలు సహా లోన్లు, నగదు లావాదేవీలు సహా ఇతర పనుల కోసం బ్యాంకులకు వెళతారు.

అలాంటి సందర్భాలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయనే విషయం తప్పక తెలుసుకోవాలి. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాల ప్రకారం నిర్దిష్ట రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో కలిపి సెలవులు ఉంటాయి. ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఈ క్రమంలో జూన్‌లో 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.


జూన్ 2024లో బ్యాంకు సెలవులు

  • జూన్ 2 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు వారపు సెలవు

  • జూన్ 8, 2024 (శనివారం) - నెలలో రెండవ శనివారం

  • జూన్ 9 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారపు సెలవు

  • జూన్ 15న మిజోరం, ఒడిశాలో రాజా సంక్రాంతి సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి

  • జూన్ 16 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారపు సెలవు

  • జూన్ 17న ఈద్ ఉల్ అధా సందర్భంగా మిజోరాం, సిక్కిం, ఇటానగర్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే


  • జూన్ 18న ఈద్-ఉల్-అజా కారణంగా జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి

  • జూన్ 22 నాలుగో శనివారం దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి

  • జూన్ 23 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారాంతపు సెలవు

  • జూన్ 30 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారాంతపు సెలవు


ఇది కూడా చదవండి:

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

ఇక ఇళ్ల ధరల పెరుగుదల అంతంతే


Read Latest Business News and Telugu News

Updated Date - May 23 , 2024 | 02:55 PM