ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:58 PM

ప్రస్తుతం గణేష్ చతుర్థి, నవరాత్రి, దసరా పండుగల సీజన్‌ వచ్చేస్తుంది. ఈ సమయంలో అనేక మంది కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే అనేక మంది మాత్రం కార్ లోన్(car loans) కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Lowest Interest Car Loan rates

ప్రస్తుతం గణేష్ చతుర్థి, నవరాత్రి, దసరా పండుగల సీజన్‌ వచ్చేస్తుంది. ఈ సమయంలో అనేక మంది కార్(car) కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే కొంత మంది ఒకేసారి నగదు చెల్లించి తీసుకుంటారు. కానీ అనేక మంది మాత్రం కార్ లోన్(car loans) కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వార్త. మీరు కార్ లోన్ తీసుకునే విషయంలో ఏ బ్యాంకు నుంచి తీసుకుంటే తక్కువ ధరలో రుణాన్ని పొందవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ చుద్దాం.


HDFC బ్యాంక్

ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 5 లక్షల వరకు కార్ లోన్‌లపై ప్రారంభ రేటుతో 9.20 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.

ICICI బ్యాంక్

అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఐదేళ్ల కాలపరిమితికి రూ. 5 లక్షల కార్ లోన్‌పై 9.10 శాతం ప్రారంభ వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

SBI

భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఐదేళ్ల కాల వ్యవధికి రూ. 5 లక్షల కార్ లోన్‌పై 8.95 శాతం ప్రారంభ వడ్డీ రేటును వసూలు చేస్తుంది.


బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా ఐదేళ్ల కాలపరిమితికి రూ. 5 లక్షల కొత్త కారు రుణంపై 8.90 శాతం ప్రారంభ రేటును వసూలు చేస్తుంది.

IDFC

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఐదేళ్ల కాలపరిమితికి రూ. 5 లక్షల కార్ లోన్‌పై 9 శాతంపైగా వడ్డీని వసూలు చేస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా

బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లు ఐదేళ్ల కాల వ్యవధికి రూ. 5 లక్షల కార్ లోన్‌పై 8.85 శాతం వరకు వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి.


UCO బ్యాంక్

ఉకో బ్యాంక్ ఐదేళ్ల కాలపరిమితికి రూ. 5 లక్షల కార్ లోన్‌పై 8.45 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అయితే మిగతా బ్యాంకులతో పోలిస్తే దీనిలో ప్రస్తుతం అతి తక్కువగా వడ్డీ రేట్లకు కార్ లోన్స్ లభిస్తున్నాయి.

EMIలు

మీరు తీసుకున్న రుణంపై చెల్లించే EMIలు.. వడ్డీ రేటు, వ్యవధిని బట్టి మారుతుంటాయి. తక్కువ వ్యవధిలో తీసుకున్న రుణం చెల్లింపు చేస్తే ఈఎంఐలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలంలో రుణాన్ని చెల్లించేందుకు సిద్ధమైతే ఈఎంఐ తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మీరు కార్ లోన్ తీసుకునే ముందు తక్కువ వడ్డీ రేటుకు ఏ బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయో తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఖర్చులను తగ్గించుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..


Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 01:02 PM

Advertising
Advertising
<