ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Prices: మహిళలకు మళ్లీ గుడ్ న్యూస్.. ఇవాళ కూడా..

ABN, Publish Date - Oct 16 , 2024 | 07:27 AM

తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ(అక్టోబర్ 16న) హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,940 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,390లుగా ఉంది.

హైదరాబాద్: దసరా, దీపావళి పండగల సందర్భంగా బంగారానికి సాధారణ రోజుల కంటే గిరాకీ బాగా పెరిగింది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయం ప్రకారం ఎక్కువగా పండగల సమయంలోనే పసిడిని ఇంట్లోకి తెచ్చుకునేందుకు ఎక్కువ మంది మహిళలు ఇష్టపడుతుంటారు. అలాగే వీటిని ఓ పెట్టుబడిగానూ చూస్తుంటారు. అయితే బంగారం రేట్లు అనేవి ప్రతి రోజూ తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. అయితే మూడు నెలల కిందట తగ్గిన వీటి ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. అయితే గత రెండ్రోజులుగా వాటి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు..

తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ(అక్టోబర్ 16న) హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,940 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,390లుగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,940 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.77,390లుగా ఉంది. అలాగే హైదరాబాద్‌‌లో వెండి కేజీ ధర రూ.102,900 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో రూ.102,900లుగా ఉంది. అయితే నిన్నటి రేట్లతో పోలిస్తే బంగారంపై రూ.10, వెండిపై రూ.100 మేర ధర తగ్గింది.


ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,090ఉండగా.. 24 క్యారెట్ల రేటు రూ.77,540లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,940కాగా.. 24 క్యారెట్ల ధర రూ.77,390లుగా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.70,940 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,390లుగా ఉంది. ఇక బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.70,940 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,390లుగా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే చెన్నైలో కిలో వెండి ధర రూ.102,900 కాగా.. ఢిల్లీలో రూ.96,900, బెంగళూరులో రూ.91,900, ముంబైలో రూ.96,800లుగా ఉంది.

Updated Date - Oct 16 , 2024 | 07:27 AM