Gold Rates: త్వరపడండి.. బంగారం ధరలు తగ్గాయ్..
ABN, Publish Date - May 26 , 2024 | 07:36 AM
బంగారం ధరల(Gold rates)కు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ విపణి ప్రభావంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల ధర రూ.80వేలు దాటుతుందనుకున్న సమయంలో తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు కొనేందుకు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది. దేశ రాజధాని సహా తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు(Silver rates) ఎలా ఉన్నాయో చూద్దాం..
హైదరాబాద్, మే 26: బంగారం ధరల(Gold rates)కు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ విపణి ప్రభావంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల ధర రూ.80వేలు దాటుతుందనుకున్న సమయంలో తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు కొనేందుకు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది. దేశ రాజధాని సహా తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు(Silver rates) ఎలా ఉన్నాయో చూద్దాం..
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు కాస్త స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400ఉండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,400ఉండగా, 24క్యారెట్ల పసిడి ధర రూ.72,400గా నడుస్తోంది. విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.66,400, 24క్యారెట్ల బంగారం ధర రూ.72,400వద్ద కొనసాగుతోంది.
ఇక ఢిల్లీలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 66,550కాగా, 24క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.72,590గా ఉంది. ముంబయిలో 22క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,400గా ఉండగా, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,440గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,550గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,600 వద్ద కొనసాగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం 22క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,400కాగా, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,440 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే ధరలు స్థిరంగానే కొనసాగుతున్నప్పటికీ కిలో వెండి రూ.లక్ష దాటేసరికి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ముంబయి, దిల్లీ, పుణె నగరాల్లో కిలో వెండి ధర రూ.91,500గా ఉండగా.. చెన్నై, హైదారబాద్, విజయవాడ, విశాఖపట్నం, కేరళలలో రూ.96,000గా ఉంది.
ఇవి కూడా చదవండి:
జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాపై డాక్టర్ రెడ్డీస్ ఆసక్తి
అరబిందో ఫార్మా లాభంలో 80% వృద్ధి
Updated Date - May 26 , 2024 | 01:56 PM