Elon Musk: ట్రంప్ గెల్చిన తర్వాత భారీగా లాభపడ్డ ఎలాన్ మస్క్.. సరికొత్త రికార్డు
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:16 PM
అగ్రరాజ్యం అమెరికాలో ఇటివల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా ఎలాన్ మస్క్ భారీగా లాభపడ్డారు. అవును మీరు విన్నది నిజమే. ట్రంప్ విక్టరీ తర్వాత మస్క్ సంపద ఏకంగా 313 బిలియన్ డాలర్లను దాటేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎలాన్ మస్క్ (Elon Musk) సంపద భారీగా పెరిగింది. గత మూడేళ్లలో తొలిసారిగా ఆయన సంపద 300 బిలియన్ డాలర్లు (రూ. 25 లక్షల కోట్లు) దాటడం విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత టెస్లా నికర విలువ పుంజుకుంది. రాయిటర్స్ ప్రకారం ఎలాన్ మస్క్ ఇటివల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (donald trump) మద్దతు ఇచ్చారు. దీంతో టెస్లా CEO మస్క్ సంపద ప్రస్తుతం $300 బిలియన్లను మించిపోయింది. శుక్రవారం నాటికి టెస్లా మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్ల (రూ. 84 లక్షల కోట్లు) పైన ఉంది.
మొదటిసారిగా..
ఈ కంపెనీ షేర్లు ఏకంగా 8.2 శాతం పెరిగి 321.22 డాలర్లకు చేరుకోవడం రెండేళ్లలో ఇదే తొలిసారి. కంపెనీ షేర్లలో 29 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 230 బిలియన్ డాలర్ల (19 లక్షల కోట్లు) కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసింది. జనవరి 2023 తర్వాత ఇప్పటివరకు కంపెనీకి ఇదే అత్యుత్తమ పనితీరుగా నమోదైంది. ట్రంప్ విజయం తర్వాత ఎలాన్ మస్క్ కంపెనీలు అమెరికాలో లాభాల బాట పడతాయని ఇన్వెస్టర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మస్క్ బహిరంగంగానే ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు.
నిబంధనల సడలింపు ఉంటుందా..
ట్రంప్ విజయం తర్వాత మొదట ప్రయోజనం పొందిన వ్యక్తి ఎలాన్ మస్క్ అని ఓ సీనియర్ ఆర్థిక నిపుణుడు చెప్పడం విశేషం. భవిష్యత్తులో కూడా మస్క్ కంపెనీలు నేరుగా ప్రయోజనం పొందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టెస్లా ఆటోమేటెడ్ వాహనాలకు అమెరికాలో చట్టపరమైన వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి అనుమతులు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటు US నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ టెస్లా నిబంధనలలో కొంత సడలింపు ఇవ్వవచ్చని అంటున్నారు. ఇలాంటి పరణామాలు మస్క్ సంస్థలకు మరిన్ని లాభాలు తెచ్చి పెట్టనున్నాయి.
భిన్నమైన ట్రాఫిక్ రూల్స్
ప్రస్తుతం ఎలాన్ మస్క్ దృష్టి అంతా అటానమస్ వెహికల్ టెక్నాలజీపైనే ఉంది. 30 వేల డాలర్ల (రూ. 25,31,494) కంటే తక్కువ ధరకే కారును విడుదల చేయాలన్నది మస్క్ కల. కానీ కొన్ని అవాంతరాల కారణంగా ప్రక్రియ ఆలస్యమైంది. వాహన నిబంధనలను సడలించేలా ట్రంప్‌ను మస్క్ ఒప్పిస్తే ఆటో రంగానికి మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు అమెరికా అంతటా ఒకే నియమాలను కోరుకుంటున్నాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో నిబంధనలు ఒకేలా లేవు. టెస్లా ప్రపంచంలోనే అత్యంత ధనిక కార్ల తయారీ సంస్థగా ఉంది. టెస్లా షేర్లు గత ఏడాది కాలంలో 93.47 రెట్లు పెరిగాయి. ఎన్విడియాలో ఈ సంఖ్య 38.57 రెట్లు కాగా, మైక్రోసాఫ్ట్‌లో ఇది 30.77 రెట్లుగా ఉంది.
ఇవి కూడా చదవండి:
Business Idea: ఈ పాల వ్యాపారం చేయండి.. నెలకు రూ. 5 లక్షలకుపైగా సంపాదించండి..
Personal Finance: కేవలం రూ. 1200తో కోటీశ్వరులవ్వండి.. అందుకు ఎన్నేళ్లు పడుతుందంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Personal Finance: రూ. 2 కోట్లు సంపాదించాలంటే రోజు ఎంత పొదుపు చేయాలి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 10 , 2024 | 12:18 PM