Manmohan Singh Net Worth: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా..
ABN, Publish Date - Dec 27 , 2024 | 08:32 AM
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయస్సులో ఆయన నిన్న రాత్రి 9:51 గంటలకు తుది శ్వాస విడిచారు. అయితే ఈ మాజీ ప్రధాని ప్రస్తుత ఆస్తులు ఎంత అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9.51 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి నేపథ్యంలో అనేక మంది సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు మన్మోహన్ సింగ్ సంపాదించుకున్న ఆస్తులు (Manmohan Singh Net Worth) ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా పనిచేశారు. ఆ క్రమంలో ఆయన కృషి, పని పట్ల నిబద్ధత విషయంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. ఇక ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో
డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. ఆయన 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి తదుపరి విద్యను అభ్యసించారు. 1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. ఆ తర్వాత 1962లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని నఫీల్డ్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో డి.ఫిల్ చేశారు.
కీలక పదవులు
మన్మోహన్ సింగ్ 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. డా. సింగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, ప్రధాన మంత్రికి సలహాదారుగా ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
ప్రధానమంత్రిగా సహకారం
2004లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ 14వ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆయన 10 సంవత్సరాల పదవీకాలంలో గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి అనేక కొత్త పథకాలను అమలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA), జాతీయ ఆహార భద్రతా చట్టం, భారతదేశం-ఆస్ట్రేలియా అణు ఒప్పందం వంటి కీలక నిర్ణయాలు తన హయాంలో జరిగాయి.
మన్మోహన్ సింగ్ ఆస్తులు ఎంతంటే..
ప్రధానమంత్రి పదవిని వీడిన తర్వాత మన్మోహన్ సింగ్ తన భార్యతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య శ్రీమతి గురుశరణ్ కౌర్‌లకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ మాజీ ప్రధాని చాలా సాదాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు. చాలా తక్కువగా మాట్లాడేవారు. ఇక ఆయన ఆస్తుల గురించి చెప్పాలంటే ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 15 కోట్ల 77 లక్షలు. రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఢిల్లీ, చండీగఢ్‌లో ఓ ఫ్లాట్ ఉంది. అఫిడవిట్ ప్రకారం మన్మోహన్ సింగ్‌కు ఎలాంటి అప్పులు లేవు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 27 , 2024 | 08:34 AM