ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Markets: సెన్సెక్స్ 80,000కి చేరుకుంటుందా.. నిపుణులు ఏమన్నారంటే

ABN, Publish Date - Jun 28 , 2024 | 10:31 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(జూన్ 28న) కూడా ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే పటిష్టత కనిపించింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 214 పాయింట్ల లాభంతో 79,457 వద్ద ప్రారంభమై 79,546 గరిష్ట స్థాయికి చేరుకుంది.

Sensex reach 80,000

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(జూన్ 28న) కూడా ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే పటిష్టత కనిపించింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 214 పాయింట్ల లాభంతో 79,457 వద్ద ప్రారంభమై 79,546 గరిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా 41 పాయింట్ల లాభంతో 24,085 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ బ్యాంక్ 83 పాయింట్ల పెరుగుదలతో 52,874 వద్ద 24,124 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్ నుంచి స్థిరమైన సంకేతాలు సహా పలు అంశాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో కొనసాగుతున్నాయి.


ఈ నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, కోల్ ఇండియా, ONGC, SBI కంపెనీల షేర్లు టాప్ 5 లాభాల్లో(top 5 gaining stocks) ఉండగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, HCL టెక్, కోటక్ మహీంద్రా సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో(top 5 loss stocks) ఉన్నాయి. మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు 1 శాతానికి పైగా పడిపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం చొప్పున పెరిగాయి.


ఇటీవల ర్యాలీలో మంచి ధోరణి కారణంగా మరికొన్ని రోజుల్లో సెన్సెక్స్(sensex) 80,000కి చేరుకుంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విజయకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. లార్జ్‌క్యాప్‌లతోపాటు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బలంగా ఉన్నాయని చెప్పారు. అయితే DIIలు లాభాలను బుక్ చేస్తున్నందున ఎప్పుడైనా సవరణలు జరగవచ్చన్నారు. ఎఫ్‌ఐఐలు, డిఐఐల మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ విజయం సాధించిందన్నారు.


ఇది కూడా చదవండి:

Airport Roof Collapse: కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు


Budget 2024: బడ్జెట్ 2024లో సెక్షన్ 80సీ పరిమితి పెంచుతారా.. ఆశలు నెరవేరుతాయా ?



For Latest News and Business News click here

Updated Date - Jun 28 , 2024 | 10:34 AM

Advertising
Advertising